కరోనా వైరస్. దీన్ని పలు విధాలుగా చెప్పుకోవచ్చు. బాక్టీరియా కాబట్టి విష పురుగు అనుకోవచ్చు. అలాగే గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందని అంటున్నారు కాబట్టి విషపు గాలి అని కూదా అనుకోవచ్చు. ఏది ఏమైనా కరొనా  వైర్స్  పేరే ఇపుడు ప్రపంచాన్ని పెద్ద ఎత్తున  హడలెత్తిస్తోంది. 

 

ఇపుడు కరోనా మానవుడుకి మూడు ఆప్షన్లు ఇస్తోంది. అవేంటి అంటే ఇంట్లో ఉంటావా. లేక ఆసుపత్రికి పోతావా. లేక మీ ఇంట్లో ఫొటోకెక్కి వేలాడుతావా. నిజం చెప్పాలంటే ఇవి సూటి ప్రశ్నలు.  ఇంకా చెప్పాలంటే కచ్చితమైన ప్రశ్నలు. ఎవరికి వారు నిర్ణయించుకునేల కరోనా నిలదీసి నిగ్గదీసి అడుగుతున్న ప్రశ్నలు.

 

కరోనా భూతం ఇపుడు భారత్ లో ప్రవేశించింది. దాన్ని అంతం చేయడానికి   మార్గం లేదు, ఎందుకంటే మందులే అసలు లేవు  కాబట్టి. కేవలం కట్టడి చేయడానికి మాత్రమే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కరోనా భారత్ లో  వైరస్ వీర విహారం చేయకుండా ఎవరి మటుకు వారు సరైన చర్యలు తీసుకోవాలి. లాక్ డౌన్ అన్నా, కర్ఫ్యూ అన్నా కూడా సహకరించాలి.

 


ఇక చర్యలు అంటే పెద్ద పనులేవీ చేయనవసరం లేదు. కాస్తా ఓపికపట్టి కొన్నాళ్ళు ఇంటిపట్టున ఉంటే సరిపోతుంది. కరోనా కట్టడి అవుతుంది. అపుడు మళ్ళీ మనం మన దైనందిన జీవితాన్ని కొనసాగించవచ్చు. అలా కాకుండా బయటకే వెళ్తాను, నాకు నచ్చినట్లు ఉంటాను అంటే చెప్పుకున్నట్లుగా గోడకు ఫోటోగా వేళ్ళాడడమే. 

 

కఠిన కరోనా ఈ ప్రశ్నలు వేస్తోంది. సవాల్ చేస్తోంది. దానికి బదులు మనం ఇవ్వాలి. సమర్ధంగా దాన్ని ఎదిరించాలంటే ఇంటిపట్టున ఉండి దాని దేశం బయటకు ఇంకా వీలైతే ప్రపంచం బయటకు పంపడం చేయాలి. అంటే మనకు మనమే స్వీయ నిర్బంధంలోకి వెళ్ళిపోవాలి. అంతే. మన హెల్త్ లైఫ్ కోసం ఆ పని చేయలేమా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: