కరోనా... కరోనా... దీని దెబ్బకి ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుందో మరి ప్రత్యేకంగా చెప్పుకోవాలిసిన అవసరం లేదు. దీని దెబ్బకి అసలు ప్రపంచంలో మనిషి మనుగడ ఉంటుందో లేదో అన్న పరిస్థితికి చేరింది లోకం. డిఇకి ప్రధాన కారణం ఇప్పడి వరకు ఈ వైరస్ కి మందు కనుకోకపోవడమే. కాబట్టి ఇది ఇంతలా ప్రపంచ దేశాలని వణికిస్తోంది అని చెప్పవచ్చు. ఈ వైరస్ దెబ్బకి కేవలం మూడు నెలల వ్యవధిలో సుమారు పదకొండు వేల మంది చనిపోయారంటే పరిస్థితి ఎలా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. 

 

 

కాకపోతే ఇప్పుడు కాస్త జాగ్రత్తల, కొన్ని ఎక్కువ మోతాదు కలిగిన మందుల్ని ఒక క్రమంలో వాడుతుండడంతో కొంతమంది ఈ మహమ్మారి నుంచి బయట పడ్డారు. అయితే ఇప్పుడు ఈ కరోనా  వైరస్ వల్ల అత్యధిక ప్రమాదం ఎదుర్కొంటున్న హై రిస్క్ వ్యక్తులను వైరస్ బారిన పడకుండా రక్షించేందుకు మలేరియా మందు హైడ్రాక్సీ క్లోరోక్విన్ వినియోగించవచ్చని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) ఒక సభా పూర్వకంగా ప్రకటించింది.

 

 


ముక్యంగా దీనిని కరోనా అనుమానితులు, బాధితులకు వైద్య సేవలు అందించే వారు కరోనా బారిన పడకుండా ఈ ఔషధం తీసుకోవాలని వారు సూచించారు. ఇంకా అలాగే కరోనా పాజిటివ్ వ్యక్తుల కుటుంబీకులకు కూడా ముందు జాగ్రత్త చర్యగా ఈ మందుని ఇవ్వాలని తెలిపింది. ఇక పోతే కరోనాకు మందు లేని నేపథ్యంలో ఈ మలేరియా నిరోధక ఔషధంపై ప్రపంచ దేశాల దృష్టి కేంద్రీకృతమైన విషయం అందరికి తెలిసిన విషయమే. 

 

 


ఇప్పట్లో కొత్త ఔషధం కనిపెట్టే బదులు అందుబాటులో ఉన్న ఔషధాల్లోనే ఏ మందు అయితే మంచి ఫలితాల్ని ఇస్తోందో తెలుసుకునేందుకు పరిశధకులు వాటిపై పూర్తిగా స్టడీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైడ్రాక్సీక్లోరోక్విన్ అనేది తెరపైకి వచ్చింది. మాములుగా దీని వల్ల ఏర్పడే సైడ్ ఎఫెక్ట్స్‌ గురించి శాస్త్రవేత్తలకు ముందుగానే ఎప్పుడో తెలుసు. కాకపోతే ప్రస్తుతం ఇవే సైడ్ ఎఫెక్ట్స్  కరోనా పనిబట్టే ఆయుధాలుగా మారాయి అని చెప్పవచ్చు. ఏది ఏమైనా కొంతవరకు ఈ మందులు కరొనను అడ్డుకుంటాయంటే మేలే కదా..! 

మరింత సమాచారం తెలుసుకోండి: