కరోనా చిన్న క్రిమి..పేరు కూడా చాలా అందంగా పెట్టుకుంది.. కానీ దీని లక్షణాలే కక్షకట్టినట్లుగా మనుషుల మీదపడి ఆకలితో ఉన్న అడవి మృగంలా ప్రవర్తిస్తుంది.. ఇకపోతే కరోనా వల్ల కొన్ని దేశాల పరిస్దితులైతే ఊహించుకోవడానికే మనసు రావడం లేదు.. ఇక ఈ వైరస్ వల్ల చైనా తర్వాత అత్యధిక బాధితులతో విలవిల్లాడుతున్న ఇటలీలో.. పరిస్థితి దయనీయంగా మారిన సంగతి తెలిసిందే. అక్కడి హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్న రోగులు ‘ఊపిరి’ కోసం పడుతున్న బాధను చూస్తే.. గుండె బరువెక్కుతుంది.

 

 

దీని బారిన పడిన వారిని ఇది ఎలా బాధిస్తుందంటే నేరుగా ఊపిరితిత్తుల్లోనే తిష్ట వేస్తుంది. ముక్కు, నోరు లేదా కళ్ల నుంచి నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరే వైరస్.. అక్కడి కణాలను నాశనం చేయడం మొదలుపెడుతుంది. అది చేసే దాడిని తట్టుకొనే రోగ నిరోధక శక్తి శరీరానికి ఉంటే.. తప్పకుండా ప్రాణాలతో బయటపడవచ్చు. లేకుంటే.. వైరస్ పెట్టే హింసను భరిస్తూ నరకయాతన అనుభవించాలి. అందుకే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులే ఈ వైరస్‌కు బలవ్వుతున్నారు. ఇకపోతే ఊపిరితిత్తుల్లో వైరస్ నాశనం చేసే కణాలన్నీ కఫం ద్వారా బయటకు వస్తాయి. ఆ తర్వాత ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకి.. నీరు పడుతుంది.

 

 

అది కాస్తా న్యూమోనియాకు దారి తీస్తుంది. ఫలితంగా రక్తానికి ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతుంది. ఆ తర్వాత కిడ్నీల ఫెయిల్యూర్ లేదా మరేదైనా అవయవం పనిచేయడం నిలిచిపోవడం ద్వారా మరణాలు సంభవిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇకపోతే ఇటలీలో ఇప్పుడు ఏ హాస్పిటల్‌లో చూసిన కోవిడ్-19 బాధితులే. కరోనా సోకిన చాలమందికి ఊపిరి అందుకోలేక ఇబ్బంది పడుతున్న వారికి కృత్రిమ శ్వాస అందిస్తున్నారు వైద్యులు.

 

 

ఒక్కొక్క బాధితుని ఇబ్బందులను చూస్తే గుండె బరువెక్కు తుంది. వారికి శ్వాస అందించేందుకు వైద్యులు ఎంతో శ్రమిస్తున్నారు. ఇంకా ఎన్నో అత్యాధునిక సదుపాయాలు ఉన్నా వారి ప్రాణాలను కాపాడలేక పోతున్నాయి. ఈ దయనీయ దృశ్యాలను చూసిన వారందరు కాస్తైన జాగ్రత్తగా వ్యవహరించడం నేర్చుకోండి..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: