దేశంలోని నిరుగుద్యోగులకి గుడ్ న్యూస్.. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ - NALCO ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి గాను గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ (GET) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 120 పోస్టుల్ని ప్రకటించింది. ఈ ఉద్యోగాలకి గాను గేట్ - 2020 స్కోర్ ని ఆధారంగా వీరిని ఎంచుకోవడం జరుగుతుంది. ఇందు కోసం దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలు అయ్యింది. 

 

 


ఈ ఉద్యోగాలకి దరఖాస్తు ఏప్రిల్ 9, 2020 చివరి తేదీ. ఇంకా ఈ నోటిఫికేషన్‌ కు సంబంధించిన పూర్తి వివరాలను https://nalcoindia.com/ వెబ్‌ సైట్‌ లో చూడవచ్చు. ఇందుకు గాను NALCO రిక్రూట్మెంట్ 2020 ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. ఇందులో మొత్తం ఖాళీలు 120. ఇందుకు గాను మెకానికల్ లేదా ప్రొడక్షన్ ఇంజనీరింగ్ సంబంధించి 45 పోస్టులు , అలాగే ఎలక్ట్రికల్ లేదా పవర్ ఇంజనీరింగ్ గాను  29 పోస్టులు, ఇంకా ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్, టెలీకమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లకు గాను 15 పోస్టులు ఇవ్వబడ్డాయి. 

 


   
 

ఇంకా కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించి 9, మెటల్లార్జికల్ ఇంజనీరింగ్ సంబంధించి 13 , సివిల్ సంబంధించి 5, ఆర్కిటెక్చర్ లేదా సిరామిక్స్ ఇంజనీరింగ్ సంబంధించి 5, మైనింగ్ ఇంజనీరింగ్ లేదా డిప్లొమా సంబంధించి 4 పోస్టులు కూడా ఇందులో ఉన్నాయి. అలాగే ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం తేదీ మార్చి 20, 2020. అలాగే దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 9, 2020.  ఇక జీతం విషయానికి వస్తే మొదటి ఏడాది శిక్షణ సమయంలో రూ.10.52 లక్షలు. అలాగే జూనియర్ మేనేజర్ పోస్టుకు ఎంపికైన తర్వాత రూ.15.73 లక్షలు వస్తాయి.
నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. : https://nalcoindia.com/wp-content/uploads/2020/03/Recuitment_GET_2020_ENG.pdf .

మరింత సమాచారం తెలుసుకోండి: