కరోనా వైరస్ ఇపుడు వేగంగా అడుగులు వేస్తోంది. దాని వేగం ఎంతో 189 దేశాలను ఇపుడు సుడిగాలిగా  చుట్టేస్తున్న  తీరే చెబుతోంది. నాలుగు దశలుగా భారత్ లో విస్తరిస్తున్న ఈ మహమ్మారి తనను ఎవరైనా తేలికగా తీసుకుంటే అసలు సహించదు. మట్టుపెట్టి మారణ హోమమే స్రుష్టిస్తుంది.

 

భారత్ లో ఇపుడు కరోనా మహమ్మారి ప్రవేశించి పాతిక రోజులు అవుతోంది. ఈ స్వల్ప వ్యవధిలోనే రెండవ దశలోకి వచ్చేసింది. ఇపుడు కరోనా విస్తరిస్తున్న తీరుని చూసిన వారికి ఏ క్షణాన్నైనా మూడవ దశకు మారడం ఖాయమని అనిపించకమానదు. ఎందుకంటే దాని కదలికలు ప్రపంచం అనేక దేశాల్లో చూసింది కాబట్టి.

 

ప్రపంచంలో రెండవ అతి పెద్ద జనాభా చైనా. అక్కడ కరోనా పుట్టింది. కానీ దాన్ని తట్టుకుని తక్కువ మరణాలే నమోదు చేయించుకుంది చైనా. చైనా అభివ్రుధ్ధి చెందిన దేశం. అయినా కరోనా ప్రతాపానికి విలవిలాడిపోయింది. అదే సమయంలో మరో అభివ్రుధ్ధి చెందిన దేశం ఇటలీని తీసుకుంటే కరోనా చైనా కంటే ఎక్కువగా  కాటు వేస్తూ సాగిపోయింది.

 

రెండవ దశ నుంచి మూడవ దశకు వచ్చేటప్పటికి ఇటలీలో ఒక్కసారిగా వందల్లో నుంచి వేలల్లోకి పాజిటివ్ కేసులు మారిపోయాయి. అలాగే మరణాలు కూడా దారుణంగా జరిగాయి. ఇక అమెరికాలో చూసుకుంటే అక్కడ కూడా వేలల్లో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా గంటల్లోనే వందల్లో మరణాలు సంభవించాయి.

 

ఈ దేశాలన్నీ ఆధునిక వసతి సదుపాయాలు, సంపత్తి దండీగా ఉన్నా ప్రాణ నష్టాన్ని తగ్గించుకోలేకపోయాయి.  పైగా అక్కడ జనాభా తక్కువ. ఆ జనాభాను, అక్కడి మరణాలను, అక్కడ టెక్నాలజీని కలుపుకుని చూస్తే భారత్ లో మూడవ దశ ఎలా ఉంటుందో ఊహించుకుంటే భయం వేసే పరిస్థితి. 

 

భారత్ లో భిన్న మతాలు, ప్రాంతాలు ఉన్నాయి. దానివ‌ల్ల  కరోనా రక్కసి నియంత్రణ మాత్రమే మార్గం. ఇంటిపట్టున ఉంటూ ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా భూతాన్ని తరిమికొట్టగలం. లేకపోతే ఇప్పటివరకూ ప్రపంచంలోని దేశాలన్నింటిలోనూ సంభవించిన మరణాలు వేరు. ఒక్క భారత్ లో పెను విపత్తు సంభవిస్తే వచ్చే మరణాలు కోట్లలో ఉంటాయని ప్రపంచ ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. 

 

ఒక లెక్క ప్రకారం భారత్ లొ  ముప్పయి కోట్ల పై చిలుకు మరణాలు సంభవించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. అంటే ఇపుడున్న జనాభాలో నాలుగో వంతు. అంటే ప్రతీ నలుగురిలో ఒక భారత పౌరుడన్న మాట. దానికి సిధ్ధపడకుండా ఉండాలంటే ప్రతీ ఒక్కరూ కరోనా నియంత్రణ మీద ద్రుష్టి పెట్టాల్సిందే. అదే మనందరికీ తారకమంత్రం. కరోనా రక్కసిని ఎదిరించే యుధ్ధ తంత్రం.

మరింత సమాచారం తెలుసుకోండి: