ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఇప్పుడు భారత్ లో పంజా విసురుతోంది. తెలంగాణలో ఈ కరోనా వైరస్ మహమ్మారి చాప కింద నీరులా ప్రవహిస్తూ వస్తుంది. రోజు రోజుకు దీని బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 33కి చేరింది. దింతో తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. కరోనా వ్యాప్తి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది.

 

తాజాగా తెలంగాణ ప్రభుత్వం మర్చి 31 వరకు లాక్‌డౌన్ ప్రకటించింది. రాష్ట్రములో ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తున్నదున్న ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దింతో ప్రజలకు కొంత వరకు నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే సినిమా థియేటర్లును మూసి వేశారు.

 

తాజాగా బస్సు రవాణాను కూడా నిలిపివేసినట్లు తెలిపింది. ముఖ్యంగా ఆహారం కోసం రెస్టారెంట్లు, హోటళ్లపై ఆధారపడే వారికి ఇబ్బంది లేకుండా టేక్‌ అవే,హోం డెలివరీకి హోటళ్లకు అనుమతినిచ్చింది. దీంతో బ్యాచిలర్స్‌, హాస్టల్‌ వసతి అందుబాటులో లేని వాళ్లకు కాస్త ఊరట లభించింది.

 

రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించడం వలన ఆ ప్రభావం రైతులపై ఎక్కువగా పడుతుంది. కష్టపడి పండించిన పంటలు అమ్ముకునే సమయంలో లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి గుడ్‌న్యూస్ చెప్పింది. ఆయా గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.

 

ధాన్యం కొనుగోళ్ల కోసం రూ.25 వేల కోట్లకు బ్యాంక్ గ్యారంటీకై ఆర్థిక శాఖకు సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారు. రబీలో పండిన మొక్కజొన్నలను రూ.1760 కి కొనుగోలు చేయాలని సీఎం చెప్పారు. పౌల్ట్రీ సంక్షోభం నేపథ్యంలో రైతులు నష్టపోకుండా చర్యలు.. మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. గ్రామాల వారీగా ధాన్యం అమ్మకానికి వచ్చే పరిస్థితులు అంచనా వేసి కొనుగోళ్లకు టోకెన్ ద్వారా ఏర్పాట్లు చేయాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: