మొహమాటం.. నిర్లక్ష్యం.. ఓటు బ్యాంకు రాజకీయం.. ఇదే ప్రస్తుతం దేశంలో కరోనా  వైరస్ వ్యాప్తికి కారణం అయింది. భారతదేశంలో కరోనా  వైరస్ వ్యాపిస్తుంది మొదటి దశలో కఠినంగా వ్యవహరిస్తూ మూడో దశకు చేరుకున్నది కరోనా . చైనా దేశంలో విజృంభించి ఎంతో మందిని పొట్టనబెట్టుకున్న కరోనా  వైరస్ ఇతర దేశాలకు విజృంభిస్తున్న సమయంలోనే... కఠినంగా వ్యవహరిస్తూ భారత దేశాన్ని పూర్తిగా లాక్ డౌన్ ప్రకటిస్తే దేశంలోకి ఒక్క విమానం రానీయకుండా విదేశీయులను  నుంచి కూడా ఇండియాకు రానివ్వకుండా చేస్తే కరోనా  వైరస్ భారతదేశానికి వచ్చేది కాదు కానీ అలా చేస్తే ప్రపంచం ముందు పరువు పోతుందని భారత్ మొహమాట పడింది. చివరికి విదేశాల నుంచి ఎంతోమంది వ్యాధిగ్రస్థులు ఇండియాకు వచ్చారు. 

 


 అయితే భారత్ కు  చెందిన ఎన్నారైలు చాలా మంది అక్కడ వ్యాధి వస్తుందని ఇక్కడికి రావడం మొదలుపెట్టారు. అయితే విమానాశ్రయాలలో ధర్మల్  స్క్రీనింగ్ పెట్టినప్పటికీ ధర్మల్ స్క్రీనింగ్  కేవలం బాడీలో ఉన్న వేడిని మాత్రమే గుర్తిస్తుందని.. కానీ అంతకుముందే చాలామంది జ్వరం టాబ్లెట్లు వేసుకోవడం వల్ల ఒక గంట రెండు గంటల పాటు జ్వరం కంట్రోల్ కావడంతో ధర్మం స్క్రీనింగ్ కి  కరోనా  వైరస్ చిక్కలేదు.అలా  చాలా మంది వస్తే ధర్మల్  స్క్రీనింగ్ చేసి ఎలాంటి ప్రాబ్లం లేదు అంటూ దేశంలోకి వదిలేయడంతో వారి ద్వారా చాలా మందికి ప్రస్తుతం కరోనా  వైరస్ సోకింది. ఇలా కాకుండా విదేశాల నుంచి వచ్చిన వారందరినీ క్వారంటైన్  పంపించి సపరేట్ గా ఉంచడం  వల్ల భారతదేశానికి ఇంత ముప్పు  వచ్చేది కాదు అంటున్నారు  విశ్లేషకులు. 

 


 అయితే విదేశాల నుంచి వచ్చిన వారు కరోనా వైరస్ ను  నిర్లక్ష్యం చేసి ప్రభుత్వం సూచించిన క్వారంటైన్ లో  ఉండమంటే తాము  హోమ్ క్వారంటైన్ లో  ఉంటాము  అంటూ చెప్పారు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత కుటుంబ సభ్యులు స్నేహితులు వచ్చి కలవడంతో ఈ మహమ్మారి వైరస్ పూర్తిగా విస్తరించిపోయింది అంటున్నారు. అయితే మొన్నటి వరకు కేవలం విదేశాల నుంచి వచ్చిన వారికే ఉన్న  కరోనా  వైరస్ ప్రస్తుతం మూడవ దశలో భాగంగా ఇక్కడి వాళ్లకు కూడా వస్తోంది. అయితే ప్రస్తుతం మూడో దశ ప్రారంభం లో ఉన్న దేశ ప్రజలు  మనదేశంలో ప్రభుత్వం విధిస్తున్న కర్ఫ్యూను తప్పక అందరు పాటిస్తే ఎంతో మంచిదని లేకపోతే దేశ ప్రజలందరికీ ప్రాణహాని తప్పదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: