కరోనా వైరస్ ప్రపంచంపై ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కరోనా ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తోంది. ఇంకా ఈ కరోనా వైరస్ కు భయపడి ప్రపంచ ప్రజలు 60 శాతం వరుకు ఇంటికే పరిమితం అయ్యారు. అలాంటి కరోనా వైరస్ కు భయపడకుండా.. మగవారికంటే శక్తివంతంగా ఆ పిల్లల తల్లి చేసిన పని దేశానికే గర్వకారణం. 

 

చైనా, మలేషియా, సింగపూర్, ఇటలీ, జర్మనీ, లండన్ లో కరోనా వైరస్ ఎలా పడగలు విప్పిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి కరోనా వైరస్ కారణంగా ఇక్కడ నుండి ఆ దేశాలకు వెళ్లి చిక్కుకున్న భారతీయులను ఆ మహిళా దైర్యంగా వెళ్లి తీసుకువచ్చింది.. వన్ నైట్ సెలబ్రెటీ అయ్యింది. 

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ ధీర వనిత ఆమె కెప్టెన్ స్వాతి రావల్. ఇటలీలో మన భారతీయులు చిక్కుకుపోతే వారిని స్వదేశానికి చేర్చడానికి కెప్టెన్ రాజా చౌహాన్‌తో కలిసి బోయింగ్ 777లో 263మంది భారతీయుల్ని ఇటలీ నుంచి సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చారు. 5 ఏళ్ళ పిల్లలకు తల్లి అయినా స్వాతి ఎంతో ధైర్యంతో ఇటలీకి వెళ్లి మన భారతీయులను తీసుకువచ్చింది. మగవారి సైతం వెనకడుగు వేసిన సమయంలో నేను ఉన్న అంటూ ఆమె ముందుకు వచ్చి దేశానికి గర్వకారణమయ్యింది. ఈ విషయం తెలుసుకున్న వారు స్వాతి రావత్‌పై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: