రోజు రోజుకీ కోరలు చాస్తున్న కరోనా భూతం ప్రపంచాన్ని వణికించేస్తుంది. ప్రపంచాన్ని చుట్టేస్తున్న ఈ మహమ్మారిని అరికట్టేందుకు ప్రపంచ దేశాలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. చైనాలో అల్లకల్లోలం చేసిన కరోనా ఎక్కడో ఇటలీని మాత్రం అతలాకుతలం చేసేసింది. ప్రశాంతంగా, ఎంతో కనువిందు చేసే అందాలతో ఉండే ఇటలీ ప్రస్తుతం చెల్లాచెదురైపోయింది. రోజురోజుకీ కరోనా వైరస్ మృతులు పెరిగిపోతున్నారు. ప్రస్తుతానికి 5వేలు దాటిన ఆ సంఖ్య తగ్గేలా లేదు. ఇటలీ దయనీయ పరిస్థితికి చలించిపోయిన ప్రపంచ దేశాలు తమవంతు సాయం అందిస్తున్నాయి.

 

 

ఇప్పటికే క్యూబా నుంచి డాక్టర్ల బృందం అక్కడికి చేరుకుంది. ఇండియా నుంచి వైద్య పరికరాలు, మాస్కులు పంపించింది. ఇప్పుడు చైనా కూడా తన వంతు సాయం అందించేందుకు ముందుకొచ్చింది. 100 మంది డాక్టర్లు, నర్సులను ఇటలీకి పంపించింది. చైనా అందించిన సాయానికి ఇటలీ తనదైన కృతజ్ఞత చాటుకుంది. ఏకంగా చైనా డాక్టర్లకు ఘనమైన స్వాగతం పలికింది. చైనా నుంచి వచ్చిన డాక్టర్లకు ఇటలీ జాతీయగీతం వినిపిస్తూ వారిని అత్యంత జాగ్రత్తగా రిసీవ్ చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. అక్కడి మిలిటరీ, పోలీసుల సంరక్షణలో చైనీస్ డాక్టర్లను తరలిస్తున్న దృశ్యాలు ఇటలీలోని దయనీయ పరిస్థితికి అద్దం పడుతున్నాయి.

 

 

చైనా నుంచి ఆలీబాబాతో పాటు, అనేక ఎన్జీవో సంస్థలు టన్నుల్లో మందులు సప్లై చేశారు. ఇప్పటికైతే పరిస్థితులు పూర్తిగా కంట్రోల్ తప్పినా మెరుగైన జాగ్రత్తలు తీసుకునే విధంగా ఇటలీ ప్రయత్నాలు చేస్తోంది. ఇటలీ పరిస్థితిని చూసైనా మనవాళ్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మొన్నిటి వరకూ సందడి సందడిగా గడిపిన ఆయా దేశాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎప్పుడూ పబ్ లతో, థీమ్ పార్క్స్ తో సందడి సందడిగా ఉండే లండన్, ఫ్రాన్స్, అమెరికాల్లోని వీధులు ఎక్కడికక్కడ నిర్మానుష్యంగా మారిపోయాయి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: