కరోనా వైరస్.. ఈ వైరస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది మృతి చెందుతున్నారు. ఇప్పటికే 16వేలమంది ఈ కరోనా వైరస్ కారణంగా చనిపోయారు. మూడు లక్షల మందికిపైగా ఈ కరోనా వైరస్ బారిన పడ్డారు. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. 

 

ప్రపంచమంతా చిగురుటాకులా వణికిపోతుంది. కరోనా వైరస్ భారత్ లోకి ప్రవేశించడంతో ప్రజలంతా అయోమయ స్థితిలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎవరు కూడా బయటకు రాకుండా లాక్ చేశారు. బయటకు వస్తే జైల్లో వేసేస్తారు. 

 

ఇంకా ఇటలీలో అయితే మరి దారుణం.. చైనా కంటే ఎక్కవగా నష్టపోతున్న దేశం ఇటలీ. ఇప్పటి వరుకు అక్కడ 5,476 మరణాలు సంభవించాయి. ఇంకా నిన్న ఆదివారం అయితే అయితే మరి దారుణంగా 651 మంది కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా కరోనా బాధితులు అయితే ఏకంగా 50వేలమంది ఉన్నారు. 

 

ముఖ్యంగా ఇటలీలో లోని లొంబార్డీ ప్రాంతం కరోనా కారణంగా వణికిపోతుంది. ఇంకా ఈరోజు అయితే అక్కడ మరి దారుణంగా ఉంది. మీరు నమ్ముతారా అక్కడ రాజకీయనాయకులు కరోనా వైరస్ ను కట్టడి చెయ్యలేకపోతున్నందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అంటే.. అంత దారుణంగా ఉంది ఈ కరోనా ఎఫెక్ట్. 

 

ఇక ఈ నేపథ్యంలోనే ఇటలీ ప్రభుత్వం ఆంక్షలు కఠినతరం చేసింది. ఉత్తర ఇటలీలో ప్రజలు బహిరంగంగా వ్యాయామం చేయడం నిషేధించింది. అంతేకాదు వారి ఇంటి నుండి 650 అడుగుల దూరం వరకే పెంపుడు కుక్కలను వాకింగ్ కు తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో తిరిగిన... ఆంక్షలు ఉల్లంఘించిన రూ.4 లక్షలు జరిమానా. 

మరింత సమాచారం తెలుసుకోండి: