ఓ వైపు ప్రపంచాన్ని కరోనా తరుముకొస్తోంది. ఇప్పటికే 15 వేల మందికి పైగా ప్రాణాలు తీసేసింది. ఇంకా ఆ సూక్ష్మజీవి రక్త దాహం తీరలేదు. దీన్ని ఏ ఒక్క దేశమో అరికడితే సరిపోదు. ప్రపంచం నుంచే దీన్ని తుడిచేయాలి. లేకపోతే.. ఇది ప్రపంచాన్ని అంతమొందిస్తుంది. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే.. మన పొరుగు దేశం పాకిస్తాన్ మాత్రం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ తన వక్రబుద్ది చూపిస్తూనే ఉంది.

 

 

మన ప్రధాని నరేంద్ర మోదీ మొన్న సార్క్ సమావేశాలు ఏర్పాటు చేసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరితో మాట్లాడారు. కరోనా నిధి కోసం భారత్ 70 కోట్ల రూపాయల ఫండ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మిగిలిన దేశాలనూ అడిగారు. అయితే.. ఈ సమావేశానికే పాక్ డుమ్మా కొట్టింది. సార్క్‌ దేశాల సమావేశానికి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ దూరంగా ఉన్నారు.

 

 

ఇప్పుడు మోదీ ప్రతిపాదించిన కరోనా అత్యవసర నిధి ఏర్పాటులోనూ పాకిస్తాన్ మొండి చేయి చూపించింది. నిధి కోసం బంగ్లాదేశ్‌ 1.5మిలియన్‌ డాలర్లు, అఫ్గానిస్థాన్‌ ఒక మిలియన్‌ డాలర్లు ప్రకటించాయి. మాల్దీవులు తన వంతుగా 2లక్షల డాలర్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. శ్రీలంక మరో అడుగు ముందు 5మిలియన్‌ డాలర్లు ఇచ్చేందుకు సిద్ధమైంది.

 

 

అఫ్గానిస్థాన్‌, నేపాల్‌ కూడా తమ వంతు నిధిని ప్రకటించాయి. కానీ సార్క్ దేశాల్లో భారత్ తర్వాత పెద్ద దేశమైన పాకిస్తాన్ మాత్రం మొండి చేయి చూపించి మరోసారి తన బుద్ధి బయటపెట్టుకుంది. అయితే.. కరోనా వైరస్‌ ప్రపంచాన్ని కుదిపేస్తున్న క్రమంలో తానిచ్చిన పిలుపును స్వాగతించి సహకరించిన సార్క్‌ దేశాలకు ప్రధాని మోదీ థ్యాంక్స్ చెప్పారు. ఇలాంటి కీలక సమయాల్లోనూ భారత్ పొడ గిట్టనివ్వకపోవడం పాక్ వక్రబుద్ధిని మరోసారి చాటి చెప్పింది. ఓవైపు కరోనా కమ్ముకొస్తున్నా పాక్ మాత్రం ఇండియాకు సహకరించేందుకు సిద్ధంగా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: