ప్రధాని మోడీ ఉన్న వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఒకటే ఒక మార్గం ప్రతి ఒక్కరు ఇంటికి పరిమితం కావాలని పిలుపు ఇవ్వటం జరిగింది. ఇంతకంటే మంచి మార్గం లేదు స్వీయ నిర్బంధం ఒకటే మార్గం అంటూ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని తన ప్రాణాలను కాపాడుకొని మరియు ఇతర ప్రాణాలు కూడా కాపాడుకోవాలని పిలుపునివ్వడం జరిగింది. ప్రపంచం మొత్తం ప్రస్తుతం ఇదే బాట పట్టింది. ఇటలీలో ఈ విధంగానే ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేసిన పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం ఇటలీ దేశమంతా స్మశానంగా మారింది. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలు పశ్చాత్తాపడుతూ తప్పు చేశామని బాధపడుతున్నారు.

 

 

ఇటువంటి నేపథ్యంలో జనం కర్ఫ్యూ లో భాగంగా ఎవరికి వారు స్వచ్ఛందంగా చేస్తుంటే పోలీసులు...వ్యవహరిస్తున్న తీరు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. చాలాచోట్ల నిర్బంధ కర్ఫ్యూ మాదిరిగా పోలీసులు జనంపై లాఠీ పట్టుకుని ఉద్యమకారులనో, నిరసన కారులనో కొట్టినట్లు గొడ్డును బాదినట్టు కొడుతున్నారు. సోషల్ మీడియాలో అనేక వీడియోలు ఇలాంటివి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పోలీసులు కనీసం బయటకు వచ్చిన వ్యక్తి వెర్షన్ వినకుండా ఇష్టం వచ్చినట్లు కొట్టేయడం. అలా దెబ్బలు తిన్న వ్యక్తి ఎక్కడకు వెళ్లాలి? ఎవరు ట్రీట్ చేస్తారు? ఎవరు అధికారం ఇచ్చారు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

 

 

అంతే కాకుండా మరి కొంతమంది అయితే ఈ విడియోలను సూ మోటోగా స్వీకరించి విచారణ జరిపిస్తే పోలీసుల దగ్గర సమాధానం ఏమి వుంటుంది? అంటూ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రజలపై జాలిపడుతూ అర్థమయ్యేరీతిలో తెలియజేయాలని అవసరం ఉంటే గాని బయటికి రారు, దాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు కాస్త మనుషుల్లా వ్యవహరించాలని కొంత మంది నెటిజన్లు కోరుతున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: