ఏదో సినిమాలో ఏరా ఫారెన్ వెళ్లలేదా అంటే, మరొకరు భారత దేశాన్ని విడిచి వెళ్ళలేను, ఎందుకంటే ఎక్కడ పడితే ఉములు ఉసుకోవచ్చు, ఎక్కడపడితే అక్కడ టాయిలెట్ పోసుకోవచ్చు అన్నట్టుగా, ప్రస్తుతం దేశంలో ప్రజలు వ్యవహరిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన భూమిని వణికిస్తున్న కరోనా వైరస్ మనుషుల ప్రాణాలని తీసుకెళ్ళటానికి రోడ్లపై కాచుకు కూర్చున్న నేపథ్యంలో ప్రధాని మోడీ కర్ఫ్యూ ప్రకటించడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో జనతా కర్ఫ్యూ పాటించకుండా ఇష్టానుసారంగా స్వేచ్ఛనుసారంగా వ్యవహరిస్తున్నారు.

 

కరోనా వైరస్ సరిగ్గా ఒకసారి విజృంభించింది అంటే మన దేశంలో చాలా మంది చనిపోవడం గ్యారెంటీ అని, అటువంటి పరిస్థితి ఇంటిలో రాకుండా ఉండాలంటే కాళ్లు అడుగు బయట పడకూడదని... ఒక్కసారి బయటపడింది అంటే డెత్ ఏంజెల్ ని స్వయంగా నువ్వే ఇంటికి తీసుకొచ్చినట్టు అవుతుంది అని, చాలా మంది ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని, కంటి ముందు వున్న కన్న వారికోసం ముఖ్యంగా వయసు పైబడిన వాళ్లకోసం ఇంటిలో నుండి అడుగు బయట వేయకూడదు అంటూ సూచిస్తున్నారు.

 

రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ వైరస్ ప్రభావం గట్టిగా ఉండడంతో చాలా వరకు సరిహద్దులు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుండి అలాగే రాష్ట్రంలోని ఇతర రాష్ట్రాల్లో కి ఎవరు వెళ్లకుండా కట్టడి చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా వైరస్ కట్టడి విషయంలో పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు.

 

అయినా గాని కొన్ని చోట్ల ప్రజల నుండి సరైన స్పందన రాకపోవడంతో ఇటువంటి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే చాలాచోట్ల సమూహాలుగా జనం తిరుగుతున్న నేపథ్యంలో కలిసి తిరిగి అరెస్టు చేయటానికి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ వాలని కొందరు మేధావులు జగన్ ముందర ప్రతిపాదన పెట్టినట్లు అలా చేస్తే గాని పబ్లిక్ కంట్రోల్ అవుతాయని సూచిస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: