ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు ప్రధాన ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుల మధ్య ఉన్న వైరం గురించి అందరికీ తెలిసిందే. ఇద్దరిమధ్య క్షణంలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. వీరిద్దరూ ఒకరి పై ఒకరు చేసుకున్న విమర్శలు మరియు ఆరోపణలకు ఇప్పటివరకు లెక్కేలేదు. రాజకీయ కక్షతో ఒకరిని జైలుకు పంపించగా మరొకరు పగ తీర్చుకోవడానికి అంతా సిద్ధం చేసుకుని ఉన్నారు.

 

ఇంతటి వైరం ఉన్న వీరిద్దరూ రాష్ట్ర శ్రేయస్సు కోసం కలిసి పని చేస్తున్నారంటే అసలు ఊహే చాలా కొత్తగా ఉంది కదా. మామూలుగా అయితే తరహా పరిస్థితులు ఊహించలేం గాని ప్రాణాంతక కోవిడ్-19 వైరస్ దిశగా మనల్ని ఆలోచించేలా చేసింది. చంద్రబాబుతో ఏకంగా జగన్ కు లేఖ రాసేలా చేసి అతనికి పలు సలహాలు సూచనలు ఇచ్చేలా చేసింది.

 

నాయుడు ఎంత ఆజన్మ శత్రువు అయినా కూడా దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న కీలక నేత. ముఖ్యమంత్రి హోదాలో ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న అతని అనుభవం ఇప్పుడు జగన్ కు ఉపయోగపడుతుంది అనే చెప్పాలి. ఏపీ విపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబు సీఎం జగన్ కు ఎలాంటి రాజకీయ అంశాలను ప్రస్తావించకుండా పలు సూచనలు మరియు సలహాలు ఇస్తూ ఒక లేఖ రాశారు.

 

రాష్ట్రంలో కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవాలని జగన్ కు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయేవారికి అండగా నిలవాలని కూడా చంద్రబాబు కోరారు. రెండు నెలలకు సరిపడా రేషన్ ఇవ్వాలని తెలిపారు. అంతేకాకుండా ప్రతి కుటుంబానికి రూ.5 వేల ఆర్థికసాయం అందించాలని సూచించారు. కూరగాయల ధరలు పెరగకుండా చూడాలని కూడా చంద్రబాబు పేర్కొన్నారు. ఇకపోతే తరహా సుహృద్భావ వాతావరణం ఇకపైనా చంద్రబాబు - జగన్ మధ్య కొనసాగాలన్న వాదన కూడా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: