ఒకపక్క కరోనా వైరస్ భయంతో భారతదేశంలోని రాష్ట్రాలు అన్నీ లాక్ డౌన్ ప్రకటించేసి నిత్యావసర వస్తువులు మరియు మందులు షాపులు తప్పించి ఒక్క దుకాణం తెరిచి ఉండకూడదని ఆదేశాలు జారీ చేసిన సమయంలో సికింద్రాబాదులోని ఇలియాజ్ అనే ఒక యువకుడికి స్వయంగా రాష్ట్ర పోలీసులే క్వార్టర్ మందు బాటిల్ ను కొనిపెట్టి మరీ తెచ్చి ఇచ్చారు. ఒక పక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నెల 31 తేదీ వరకు మందు షాపులు అన్నీ బంద్ చేయాలని చాలా స్ట్రిక్ట్ గా ఆర్డర్లు జారీ చేసినా కూడా ఇలా జరగడం హైలైట్ అనే చెప్పాలి.

 

రోజు మనం సోషల్ మీడియాలో పోలీసులు ఎంత అప్రమత్తంగా ఉండి లాక్ డౌన్ ని అటు ప్రజలతోపాటు దుకాణదారులు సవ్యంగా పాటించేలా కఠిన చర్యలు తీసుకుంటున్నారో వీడియోల రూపంలో చూస్తూనే ఉన్నాం. అయితే సికింద్రాబాద్ లో ఇలియాజ్ అనే వ్యక్తి ఒక్కసారిగా ఒక కరెంటు స్తంభం పైకి ఎక్కేసి తనకు మందు బాటిల్ కావాలని లేకపోతే 30 అడుగుల ఎత్తున స్తంభం నుండి కిందకి దూకేస్తానని బెదిరించాడు. అతను అన్నంత పని చేస్తాడని భయపడిన పోలీసులు ముందుగా కింద అతనికి గాయాలు కాకుండా ఉండేందుకు పరదా ను తీసుకొని వచ్చి అలాగే పట్టుకున్నారు.

 

ఇకపోతే ఇలియాజ్ తనకు మందు బాటిల్ తీసుకొని వస్తే తప్పించి తాను ఎట్టి పరిస్థితుల్లో కిందకి దిగడం మరియు ఆలస్యమైతే దూకేస్తానని బెదిరించగా పోలీసులే వారే స్వయంగా వెళ్లి అతని కోసం ఒక క్వార్టర్ మందు బాటిల్ తీసుకొని వచ్చారు. అయితే కిందికి దిగిన తర్వాత తనని ఏమి అనకూడదు మరియు ఏమి చేయకూడదు అని షరతు విధించిన ఇలియాజ్ పోలీసులు దానికి కూడా సరే అనడంతో చివరికి శాంతించి కిందకి దిగాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియో హల్ చల్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: