కరోనా వైరస్ తో ఇప్పుడు ఇటలీ చాలా తీవ్రంగా పోరాటం చేస్తుంది. ప్రపంచ దేశాలు అనీ దానితో పోటీ పడుతున్నాయి. ఎలా అయినా సరే దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే రెండు దేశాలు మాత్రం ఇప్పుడు కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటలీ, అమెరికా ఇప్పుడు కరోనా వైరస్ మీద పెద్ద యుద్దమే చేస్తున్నాయి. కరోనా వైరస్ కేసులు ఇటలీలో రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఊహించని విధంగా ఇటలీలో కేసులు నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్ ధాటికి ఇటలీలో ఆరు వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. 

 

ఇటలీలో 63927 మందికి కరోనా ఉంది. సోమవారం ఒక్క రోజే కొత్తగా 4789 కేసులు నమోదయ్యాయి. సోమవారం 601 మంది చనిపోయారు. మృతుల సంఖ్య 6077కి చేరింది. ఇటలీలో పరిస్థితి దాదాపుగా చేయి దాటిపోయింది అనే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు. అక్కడ ప్రభుత్వం కూడా కరోనా వైరస్ ని కట్టడి చేసే అవకాశం లేదని అంటున్నారు. ఇది ఏ విధంగా అదుపులోకి వస్తుందో ఆ దేశానికి అర్ధం కాని పరిస్థితి నెలకొంది ఇప్పుడు. అమెరికా విషయానికి వస్తే సోమవారం 9883 కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 43,449 కి చేరింది. సోమవారం 132 మంది కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 

 

ఈ పరిస్థితి ఇప్పట్లో అదుపులోకి వచ్చే అవకాశాలు లేవని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పట్లో అమెరికాలో కరోనా వైరస్ కట్టడి కాదని, ఇటలీ అయితే చేతులు ఎత్తేసింది అంటున్నారు. అమెరికా మందు కనుక్కోకపోతే మాత్రం కట్టడి చేయడం అనేది ఆ దేశానికి సాధ్యం కాదు అనే అభిప్రాయాలు ఎక్కువగా వినపడుతున్నాయి. మరి దీని నుంచి ఆ రెండు దేశాలు ఏ విధంగా బయట పడతాయి అనేది చూడాలి. మందు కూడా ఇప్పట్లో రాదనీ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: