ప్రస్తుతం భారత దేశంలో ఎవరి లో చూసినా కరోనా వైరస్ భయమే కనిపిస్తోంది. చైనా నుంచి విస్తరించి ప్రపంచదేశాలను బెంబేలెత్తిస్తున్న మహమ్మారి వైరస్... భారతదేశంలో కూడా తిష్ట వేసుకున్న విషయం తెలిసిందే. ఏకంగా భారతదేశంలో మొదటి స్టేజ్ రెండవ స్టేజ్  మూడవ స్టేజ్  కూడా వచ్చేసింది. దీంతో రోజురోజుకూ ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. మొన్నటి వరకు కేవలం విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా వైరస్  ఉన్నట్లు నిర్ధారణ కాగా ప్రస్తుతం భారతీయులకు కూడా కరోనా  వైరస్ సోకుతుండడంతో  ఎంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి. 

 

 

 ఇక రాష్ట్ర ప్రజలు ఎవరు ఎక్కడ గుమిగూడి ఉండకుండా ఉండేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ జనతా కర్ఫ్యూ ప్రకటించి ప్రజలందరూ ఇంట్లోనే ఉండి కరోనా వైరస్ తో పోరాటం చేయాలి అంటూ సూచించిన విషయం విదితమే. జనతా కర్ఫ్యూ  కు ముందు నుంచే చాలామంది ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాలలో లాక్ డౌన్ విధిస్తూ కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. అసలు ప్రజలెవరూ కాలు  దాటి బయట పెట్టకుండా ఉండేందుకు కఠిన చర్యలు చేపడుతున్నారు. 

 

 

 అయితే భారతదేశంలో ఇప్పటివరకు ఏకంగా 350 కరోనా  వైరస్ పాజిటివ్ కేసులు నమోదవగా... ఈ కరోనా  వైరస్ ప్రభావం  మహారాష్ట్రలో ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ఏకంగా మహారాష్ట్ర ఒక్క రాష్ట్రంలోనే 89 కరోనా  పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో కరోనా  వైరస్ ను కట్టడి చేసేందుకు ఉద్దవ్ థాకరే  ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్ర సరిహద్దులు అన్నీ మూసి వేస్తూ నిర్ణయం తీసుకున్న ఉద్ధవ్ థాక్రే సర్కార్ 144 సెక్షన్ అమలు చేస్తుంది. తాజాగా మరో కఠిన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం లోని అన్ని  జిల్లాల సరిహద్దులు కూడా మూసి వేస్తున్నట్లు ఉద్ధవ్ థాక్రే సర్కార్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లాల మధ్య కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కేవలం నిత్యావసరాల విక్రయించే దుకాణాలు మందు షాపులు మినహా మిగతా అన్ని మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది ఉద్దవ్థాకరే సర్కార్.

మరింత సమాచారం తెలుసుకోండి: