కరోనా దేశంలో వేగంగా వ్యాపిస్తుంది. ఒక్క రోజులోనే 99 కేసులు నమోదయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు జిల్లాలో లాక్ డౌన్ విధించారు. కరోనా ఎక్కువగా వ్యాప్తి చెందడం వలన విదేశాల నుండి వస్తున్నా వారికీ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 

విదేశాల నుండి వచ్చిన వారిని ప్రభుత్వం క్వారంటైన్‌ లలో ఉంచుతున్నారు. ఇలాంటి వారు బయట సంచరిస్తే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, ప్రభుత్వం ముందు నుంచి హెచ్చరిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. క్వారంటైన్‌ లలో ఉండని వారిపై ప్రభుత్వం కేసు నమోదు చేసి,చర్యల తీసుకుంటుంది.

 

విదేశాల నుంచి వచ్చిన కొందరు మాత్రం ఇష్టానుసారం బయట తిరిగేస్తున్న నేపథ్యంలో.. ఎంత చెప్పినా వినకుండా క్వారంటైన్‌లో ఉండని వారిపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్- 1897 కింద 60 మందిపై కేసులు నమోదు చేసింది.

 

ఈ విషయంలో చెప్పినా వినని వారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చట్టాన్ని ఉల్లంఘించి ఇళ్ల నుంచి బయటికి వచ్చే వారిని ఉపేక్షించొద్దని ఉన్నతాధికారులకు ఆదేశాలు అందాయి. ఈ క్రమంలో కొత్తగూడెం వన్ టౌన్ డీఎస్పీపైనా కేసు నమోదైంది. అయితే ఆ డీఎస్పీ కుమారుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇతనికి కొంత కాలంగా అనారోగ్యం ఉండడంతో ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా కరోనా ఉన్నట్లు తేలింది.

 

ఇటీవల డీఎస్పీ అలీ తనయుడు అవాజ్ లండన్ నుంచి వచ్చాడు. అయితే, బాధ్యతతో తన కుమారుడ్ని క్వారంటైన్ చేయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు డీఎస్పీపై కేసు నమోదు చేశారు. లండన్ నుంచి వచ్చాక అవాజ్ పశ్చిమగోదావరి జిల్లా రాఘవాపురంలోని బంధువుల ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. కుటుంబ సమేతంగా అక్కడ సయ్యద్ షౌకత్ అలీ అనే వ్యక్తి గృహ ప్రవేశానికి కూడా హాజరయ్యాడు. అవాజ్‌కు కరోనా తేలడంతో ఏలూరులోని వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: