మన దేశంలో జనాలు ఓ పట్టాన ఏమి చెప్పినా వినరన్న విషయం అందరికీ తెలిసిందే. పైగా రూల్స్ రెగ్యులేషన్ అంటే అసలు పట్టించుకోరు కూడా.  ఇపుడు కూడా మనదేశంలో జరిగిందిదే. ప్రపంచ దేశాలను వణికించేస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి  ఇపుడిపుడే దేశంలో విస్తరిస్తోంది. వైరస్ వ్యాప్తిని రెండో స్టేజిలోనే కంట్రోల్ చేయాలని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు గట్టిగా అనుకుంటుంటే ప్రజలు పెద్దగా పట్టించుకోవటం లేదు. ఏదో తప్పని స్ధితిలో మాత్రమే మొన్నటి ఆదివారం జనతా కర్ఫ్యూని పాటించారు.

 

ఉదయం నుండి జనతా కర్ఫ్యూని పాటించిన జనాలు సాయంత్రం 5 గంటలు దాటగానే ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చేశారు.  ఇండియా ప్రపంచ క్రికెట్ ను గెలిస్తోనే లేకపోతే డిసెంబర్ 31వ తేదీ రాత్రి పార్టీ చేసుకున్నట్లుగానో  రోడ్లపైకి వచ్చేసి ఒకటే గోల చేసేశారు. సాయంత్రం ఒక్కసారిగా వేలమంది బయటకు వచ్చేశారంటే అర్ధమేంటి ? ఉదయం నుండి పాటించిన కర్ఫ్యూ స్పూర్తి  ఫెయిల్ అయినట్లే కదా ?

 

తమిళనాడు, కర్నాటక, మధ్యప్రదేశ్, ఒడిస్సా లాంటి రాష్ట్రాల్లో సాయంత్రం నుండి జనాలు ఒక్కసారిగా బయటకు వచ్చేయటంతోనే ప్రధానమంత్రి నరేంద్రమోడికి కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇక సోమవారం ఉదయం నుండి జరిగింది మరోక ప్రహసనం. నలుగురు ఒక్కసారిగా ఎక్కడా గుమిగూడవద్దని వైరస్ ప్రబలే ప్రమాదం ఉందని ప్రభుత్వాలు ఎంత చెబుతున్నా జనాలు లెక్క చేయటం లేదు. పైగా గుంపులు గుంపులుగా చేరి ముచ్చట్లు పెట్టకున్నారు.

 

విజయవాడ పిడబ్ల్యు గ్రౌండ్స్ లోని రైతుబజార్ మీద జనాలు దాడులు చేసి లూటీ చేయటమే ఆశ్చర్యంగా ఉంది. హైదరాబాద్ లోని ఎర్రగడ్డ రైతుబజార్లో కూడా జనాలు ఒక్కసారి దాడి చేసి అందినవాటిని అందినట్లుగా కూరగాయలను లూటి చేసేశారు. దాంతో ప్రభుత్వాలు అప్రమత్తమై కఠినంగా అమలు చేయటం మొదలుపెట్టాయి. కారణం లేకుండా రోడ్లపై తిరిగే వాళ్ళని అరెస్టులు చేస్తామని హెచ్చరిస్తున్నాయంటేనే జనాల మానసిక పరిస్ధితి ఏంటో అర్ధమైపోతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: