కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా మరణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.  చైనాలో మొదలైన కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని చుట్టేసిన సంగతి తెలిసిందే. దాదాపు 170 దేశాలకు ఈ వైరస్ విస్తరించింది. ఇక ఈ కరోనా దెబ్బకి ఇప్పటికే 15189 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 350000 మంది ఈ వ్యాధి భారిన పడ్డారు.  గత 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 1,395 మంది ప్రాణాలు కోల్పోగా, అందులో 462 మంది స్పెయిన్‌ దేశస్తులు కావడం గమనార్హం. తాజా మరణాలతో స్పెయిన్‌లో మృతి చెందినవారి సంఖ్య 2,182కి చేరుకుంది. ఈ విషయాన్ని ఆ దేశ వైద్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది.

 

కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య 33,089కి చేరింది. గత నాలుగు రోజుల నుండి ఒక్క పాజిటివ్ కేసు కూడా రాని చైనాలో సోమవారం ఏకంగా 39 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం విదేశాల నుండి వచ్చిన వారిలో ఈ పాజిటివ్ కేసులు బయట పడాయి.  ఇక చైనా మొత్తం మీద కరోనా బాధితుల సంఖ్య 81000 చేరుకుంది. 72200 మందికి ఈ వ్యాధి నయమయినట్లు చెబుతున్నారు. ఇక ఈ వైరస్ కారణంగా అక్కడ 3270 మంది మరణించారు.  ఇటలీలో 5,476 మందిని కరోనా మహమ్మారి బలితీసుకోగా, చైనాలో 3,270, స్పెయిన్‌లో 2,182 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక సౌదీలో 21 రోజుల పాటు రాత్రి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది.

 

ఉల్లంఘిస్తే రూ.లక్షన్నర జరిమానా కఠిన శిక్షలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. దుబాయ్‌ విమానాశ్రయాన్ని రెండు వారాలు మూసివేయనున్నారు. అర్జెంటీనా లాక్‌డౌన్‌ ప్రకటించింది. జలుబు, దగ్గు వంటివాటితో బాధపడేవారికి కనీసం 6 అడుగుల దూరంలో ఉండాలి.  ఇంట్లో అందరూ తరచుగా తాకే ప్రదేశాలను శానిటైజర్లు, డిస్‌ఇన్ఫెక్టెంట్లతో శుభ్రం చేస్తుండాలి.  కరోనాకు యాంటీ డోస్ కనుగొనే వరకు ఈ తిప్పలు తప్పేలా లేవని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: