కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గాను మన తెలుగు రాష్ట్రాలు ఇంకా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గాను ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చాలా నిర్ణయాలు తీసుకున్నాయి. రెండు రాష్ట్రాలకు కూడా అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి భారీగా విదేశాల నుంచి వచ్చారు. ఇక విశాఖ విమానాశ్రయం నుంచి కూడా భారీగానే వచ్చారు జనాలు. దీనితో ఇప్పుడు ప్రభుత్వం మరింత కతినంగా వ్యవహరించాలని చూస్తుంది. 

 

కేంద్ర ప్రభుత్వ సిబ్బంది ని కూడా క్వారంటైన్ లో ఉంచాలని తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక ఆస్పత్రులను కట్టించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఉన్న ఆస్పత్రులను వాటి కోసం వాడే అవకాశాలు కనపడుతున్నాయి. జనాభా తక్కువగా ఉన్న గ్రామాన్ని ఎంపిక చేసి అక్కడికి వీరు అందరిని పంపించి వైద్యం చేయించాలని అలా నగరానికి సమీపంలో ఉన్న గ్రామాలను ఎంపిక చెయ్యాలని చూస్తున్నారు. ఆ గ్రామస్తులకు కాస్త పరిహారం కూడా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రస్తుతం కరోనా కట్టడి కావాలి అంటే అది మినహా మార్గం లేదు. 

 

అందుకే ఇప్పుడు చాలా పక్కాగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మన దేశంలో కరోనా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. కాబట్టి ప్రభుత్వాలు ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా సరే దాన్ని అదుపు చేయడం అనేది సాధ్యం అయ్యే పని కాదని అంటున్నారు. మన దేశంలో ప్రస్తుతం మరణాలు దాదాపుగా తక్కువగానే ఉన్నాయి. ఇక కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే మాత్రం ఆ మరణాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఒక గ్రామం వాళ్ళను మరో గ్రామంలోకి వెళ్ళకుండా కూడా చూస్తే స్థాయిలో కఠిన చర్యలను అమలు చెయ్యాలని పలువురు కోరుతున్నారు. అలాగే నగరాలకు కూడా రవాణా బంద్ చెయ్యాలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: