ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ గజ గజా వణికిస్తూ ఉన్న విషయం తెలిసిందే. మొదట చైనాలో విజృంభించిన ఈ మహమ్మారి వైరస్ అక్కడ కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రపంచ దేశాల్లో శరవేగంగా వ్యాప్తిచెందుతుంది... అందరినీ ప్రాణభయంతో వణికిస్తోంది. ఈ వైరస్కు సరైన వ్యాక్సిన్  కూడా అందుబాటులో లేకపోవడం నివారణ ఒక్కటే మార్గం కావడంతో ప్రజలు మరింత ఆందోళన నెలకొంటోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలకు పైగా ఈ మహమ్మారి వైరస్ విస్తరించింది. ఆయా దేశాల ప్రభుత్వాలు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వైరస్ వ్యాప్తి మాత్రం శరవేగంగా జరుగుతోంది. ఇక ఎంతో అభివృద్ధి చెందిన ఇటలీ ఇరాన్ లాంటి దేశాల పరిస్థితి చేయి దాటి పోతుంది. దీంతో కరోనా వైరస్ ను జయించడం మా వల్ల కాదు అంటూ చేతులెత్తేస్తున్నారు ఆయా దేశాల ప్రభుత్వాలు. 

 

 

 ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలలో కరోనా  వైరస్ వ్యాప్తి చెంది బెంబేలెత్తిస్తూ ఉంటే... ఇప్పటివరకూ రష్యా ఉత్తర కొరియాలో మాత్రం వ్యాపించలేదు ఈ వైరస్. ప్రపంచ దేశాలలో కరోనా  వైరస్ తన ప్రతాపాన్ని చూపుతోంది.. ఓ వైపు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతునే  మరోవైపు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నది. కానీ రష్యా, ఉత్తర కొరియాలో మాత్రం వైరస్ ప్రభావం కొంచెం కూడా లేదు. చైనా దేశాల్లో కూడా వైరస్ కు  మూల బిందువైన వుహాన్  నగరం మినహా ఇతర నగరాల్లో వైరస్ ప్రభావం లేదు. ప్రస్తుతం చైనాలో రికవరీలు కూడా వేగంగా జరిగిపోతున్నాయి. దీనంతటికీ విశ్లేషకులు చెబుతున్న ఒకే ఒక మాట ఇదంతా చైనా ప్లాన్ అని. 

 

 

 కరోనా  వైరసు సృష్టించే ముందే చైనా ఈ వైరస్కు విరుగుడు కనుగొన్నదని... చైనాకు మిత్ర దేశాలైన రష్యా ఉత్తర కొరియాకు ముందే విరుగుడు అందజేసింది అంటున్నారు విశ్లేషకులు. అందుకే ఈ వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్నప్పటికీ ఇప్పటివరకూ రష్యా, ఉత్తర కొరియా దేశాల్లో మచ్చుకైనా మాత్రం లేదు అంటున్నారు. ఆర్థికంగా ప్రపంచవ్యాప్తంగా బలమైన దేశంగా ఎదగాలనుకున్న చైనా కు ముందున్న పెద్ద సవాలు అమెరికా. అమెరికాను ప్రత్యక్షంగా ఎదుర్కోలేకనే ఇలా మహమ్మారి వైరస్ కారణంగా.. అమెరికా ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసేందుకు ప్లాన్ చేసింది అంటున్నారు విశ్లేషకులు. ఈ ప్లాన్ లో  ఇతర దేశాలు కూడా బలి  కావాల్సిన పరిస్థితి వచ్చింది అంటున్నారు. ఒకవేళ విశ్లేషకులు అనుమానిస్తున్నట్టుగా  ఈ వైరస్ ప్లాన్ అయితే.. ఆర్థికంగా బలంగా ఉన్న కొన్ని దేశాల్లో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అతలాకుతలం అయ్యాకా... కరోనా  వైరస్ కు విరుగుడు కనిపెట్టాము  అంటూ చైనా ప్రకటన విడుదల చేస్తుంది అంటున్నారు విశ్లేషకులు. ఇక మొదటి నుంచి ఇలాంటి అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: