క‌రోనా వైర‌స్ బారిన ప‌లువురు హాలీవుడ్ ప్ర‌ముఖులు ప‌డిన విష‌యం ప‌డ్డారు. ఇందులో ప‌లువురు చికిత్స పొందుతుండ‌గా, మ‌రికొంద‌రు కోలుకున్నారు. కోలుకున్న జాబితాలో ఇప్పుడు జేమ్స్ బాండ్ హీరోయిన్ ఓల్గా కురెలెంకో చేరారు. ఈ విష‌యాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆమె అనుభ‌వాల‌ను పంచుకున్నారు. ప్ర‌స్తుతం తాను కుమారుడితో క‌లిసి విలువైన స‌మ‌యం గ‌డుపుతున్నాన‌ని ఓల్గా పేర్కొంది. అలానే త‌న పోస్ట్‌లో క‌రోనాకి సంబంధించిన అనుభ‌వాలను కూడా వివ‌రించింది. * మొద‌టి వారం రోజులు చాలా క‌ష్టంగా గ‌డిచింది. తీవ్ర‌మైన జ్వరం, త‌ల‌నొప్పితో చాలా బాధ‌ప‌డ్డాను. రెండో వారంలో జ్వ‌రం త‌గ్గింది. కొద్దిగా ద‌గ్గు ఉండేది. అల‌సిపోయిన‌ట్టు అనిపించేది. రెండో వారం చివ‌ర‌లో ఆరోగ్యం కుదుట‌ప‌డింది* అని ఆమె వివ‌రించింది. ఓల్గా కురిలెంకో ఉక్రెయిన్ దేశానికి చెందిన‌ న‌టి, మోడ‌ల్.  2008లో వ‌చ్చిన జేమ్స్ బాండ్ చిత్రం క్వాంట‌మ్ ఆఫ్ సోలేక్‌, 2013లో వ‌చ్చిన సైంటిఫిక్  చిత్రాల‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇమేజ్ సంపాదించుకుంది.  

 

ఇక క‌రోనా వైర‌స్ ప్ర‌భావం అంత‌ర్జాతీయంగా చిత్ర‌సీమ‌పై తీవ్రంగా ప‌డింది. ఎక్క‌డిక‌క్క‌డ షూటింగ్‌లు నిలిచిపోయాయి. న‌టీన‌టులంద‌రూ దాదాపుగా క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఇళ్ల‌కే ప‌రిమిత‌మై.. ప‌లువురు న‌టులు త‌మ అనుభ‌వాల‌ను పంచుకుంటున్నారు. క‌రోనా వైర‌స్ బారిన ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌గా ఉండాలంటూ ప్ర‌జ‌ల‌కు సూచిస్తున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇక క‌రోనా వైర‌స్‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్ప‌టికే 15, 873 మంది మృతి చెందారు. 3.50ల‌క్ష‌ల మందికి పైగా వైర‌స్‌బారిన ప‌డ్డారు. అంతేగాకుండా.. సుమారు 170కోట్ల మంది హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. 50కిపైగా దేశాల్లో లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. ఈ గ‌ణాంకాల‌ను చూస్తే చాలు.. క‌రోనా వైర‌స్ ఏ స్థాయిలో విజృంభిస్తుందో, మాన‌వాళి మ‌నుగ‌డ‌కు ఎంత ప్ర‌మాద‌కారిగా మారిందో తెలుస్తుంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌పంచ దేశాలు క‌రోనా క‌ట్ట‌డికి క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి. ఇక భార‌త్‌లో 468 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, తొమ్మిది మ‌ర‌ణాలు సంభ‌వించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: