కరోనా వైరస్ ని కట్టడి చేయడం ఎంత మాత్రం సాధ్యం కాదని ప్రపంచం మొత్తం గట్టిగా బలంగా చెప్తుంది. మీరు తక్కువ అంచనా వేస్తే చెల్లించుకునే మూల్యంగా భారీగా ఉంటుందని కరోనా తీవ్రతను ఏ మాత్రం అంచనా వేయలేరని దాన్ని తక్కువ అంచనా వేస్తే కచ్చితంగా మూల్యం చెల్లించుకోవడం ఖాయమని ప్రపంచం హెచ్చరిస్తుంది. ఎంత మాత్రం తక్కువ అంచనా వేసినా సరే లక్షల మంది ప్రాణాలు కోల్పోవడం ఖాయమని చెప్తున్నారు. అయినా సరే మన భారతీయులు మాత్రం దీన్ని నవ్వులాట గా తీసుకున్నారు. భారత్ లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుంది. 

 

అన్ని రాష్ట్రాలు కూడా కరోనా వైరస్ బారిన పడ్డాయి. అయితే ప్రజలు మాత్రం దాన్ని లైట్ తీసుకుంటూ రోజు బయటకు వచ్చేస్తున్నారు. కర్ఫ్యూ విధించినా సరే ప్రజలు మాత్రం మాట వినే పరిస్థితి ఎంత మాత్రం కనపడటం లేదు. కరోనా వైరస్ అనేది కనపడని విపత్తు. ఎటు నుంచి ముంచుకు వస్తుందో కూడా కనీసం అంచనా వేయలేని పరిస్థితి. కరోనా వైరస్ తీవ్రతను తట్టుకోవడం అనేది మన వల్ల కాదని ఆ శక్తి మనకు లేదని అందరూ చెప్తున్నారు. అయినా సరే ప్రజలు లెక్క చేయడం లేదు. పరిస్థితి ఇప్పుడు చేయి దాటిపోయింది అని అందరూ చెప్తున్నారు. అందరూ అదే హెచ్చరిక చేస్తున్నారు. 

 

కరోనా వైరస్ ని ఏ మాత్రం లైట్ తీసుకున్నా సరే కళ్ళ ముందు శవాల దిబ్బ ఉంటుందని అందరూ చెప్తున్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు దాని మీద యుద్ధం చేస్తుంది. కాని మన భారతీయిలు మాత్రం సోషల్ మీడియాలో కామెంట్ లు చేస్తూ సందడి చేస్తూ కరోనా వైరస్ ని వినోదంగా చూస్తున్నారు. సోషల్ మీడియాలో దీని మీద సరదా కామెంట్ లు చేస్తూ ముందుకి వెళ్తుంది భారత్. ఇలా లైట్ తీసుకునే ఇటలీ నాశనం అయిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: