కరోనా వైరస్.. ఎంత దారుణంగా వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా చిగురుటాకులా వణికిపోతుంది.. అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఈ కరోనా వైరస్ ను అంతం చెయ్యాలి అనే ఉద్దేశ్యంతో ప్రజలందరూ ఎక్కడ ఉన్న వారు అక్కడే ఉండిపోయారు.. 

 

 

ఈ నెల 31వ తేదీ వరుకు ప్రజలు ఎవరు బయటకు రాకూడదు తెలుగు రాష్ట్రాలు లోక్ డౌన్ అయినా సంగతి తెలిసిందే. ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోండి.. లేదు అంటే బయటకు వచ్చి శ్మశానంలో శాశ్వతంగా రెస్ట్ తీసుకోండి అంటూ సోషల్ మీడియాలో నినాదాలు కూడా చేస్తున్నారు. ఇంకా ఈ నేపథ్యంలోనే ఈరోజు వరుకు భారత్ లో ఎన్ని కేసులు నమోదు అయ్యాయి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

భారత్ లో ఇంతవరుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యా 500 కి చేరింది. నిన్న ఒక్కరోజే 99 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇంకోక్క కేసు నమోదు ఆయింట్ సెంచురీ పూర్తయ్యేది. గత 3 రోజుల్లో కొత్తగా 245 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 500 మందిలో 40 విదేశీయులు.. కరోనా వల్ల నిన్నటికి మొత్తం 9 మంది భారత్ లో చనిపోయారు. 

 

IHG

 

దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రాలలో ఇన్ని కేసులు నమోదు అయ్యాయి.. కేరళలో 28, మహారాష్ట్రలో 23, గుజరాత్ లో 12 కేసులు నమోదు అయ్యాయి. మొత్తమ్మీద 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదు అయ్యాయి. అదేవిధంగా తెలంగాణలో కేసుల సంఖ్య 33 కు చేరింది. మరి ఇంకా ఈరోజు ఎంతమంది ఈ కరొనకు బలి అవుతారో చూడాలి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: