ప్రపంచాన్ని వణికించేస్తున్న కరోనా వైరస్ భూతం దృష్టి ఇపుడు ఇండియా మీద పడిందా ? అవుననే సమాధానం చెబుతున్నారు సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్, ఎకనామిక్స్ అండ్ పాలసి డైరెక్టర్ రమణన్ లక్ష్మీనారాయణన్. వైరస్ ను ఎదుర్కోవటంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలతా పాటు జనాల్లో కనిపిస్తున్న నిర్లక్ష్యం ఇలాగే కంటిన్యు అయితే వైరస్ వ్యాప్తి ప్రమాదకర స్ధాయికి చేరుకోవటం ఖాయమని డైరెక్టర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

వైరస్ వ్యాప్తిగురించి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చాలా లేటుగా మేల్కొన్నట్లుగా డైరెక్టర్ అభిప్రాయపడ్డారు. లేటుగా ఎందుకు మేల్కొన్నాయంటే వైరస్ ప్రభావంపై తగిన సమాచారం లేకనే అని లక్ష్మీనారాయణన్ చెప్పారు.  లేటుగా మేల్కొన్న తర్వాత ప్రభుత్వాలు తీసుకుంటున్న జాగ్రత్తలను నారాయణన్ ప్రసంసించారు. అయితే జాగ్రత్తలు ప్రభుత్వాలు తీసుకున్నంత మాత్రాన సరిపోదని అందుకు జనాలు కూడా సహకరించాలని చెప్పారు.

 

అభివృద్ధి చెందుతున్న మనదేశంలో వైరస్ వ్యాప్తి చెందటం చాలా సులభమని డైరెక్టర్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు, ప్రజలు కలిసికట్టుగా పకడ్బందీగా చర్యలు, ముందు జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ ను కంట్రోల్ చేయటం పెద్ద కష్టమేమీ కాదని కూడా డైరెక్టర్ స్పష్టం చేశారు. వైరస్ ను ఎదుర్కోవటంలో ఇలాగే వ్యవహరిస్తే సుమారు 30 కోట్లమందికి సోకే ప్రమాదం ఉందని నారాయణన్ ఆందోళన వ్యక్తం చేయటం గమనార్హం.

 

అన్నీ రకాలైన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే బాధితుల సంఖ్యను 20 కోట్లకు తగ్గించవచ్చని కూడా చెప్పారు. 20 కోటమంది బాధితులంటే మామూలు విషయమా ?  అమెరికా, బ్రిటన్ లో వైరస్ వ్యాప్తిస్తున్న పద్దతిని బట్టి నారాయణన్ మనదేశంలో కూడా వైరస్ వ్యాప్తిని అంచనా వేశారు. మనదేశంలో ప్రతి సంవత్సరం కోట్లమంది ఫ్లూ జ్వరంతో బాధపడుతుంటారట. అయితే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు మందు లేకపోవటం వల్లే సమస్య పెరిగిపోతోందట.

 

వైరస్ సోకే 30 కోట్లలో మూడోవంతు మందికి ప్రమాదకర స్ధాయికి చేరుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయకపోతే కనీసం 25 లక్షల మంది చనిపోయే ప్రమాదముందని కూడా ఆందోళన వ్యక్తం చేశారంటే పరిస్ధితి ఎంత ప్రమాదకరంగా మారుతోందో అర్ధమవుతోంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: