ప్రస్తుతం ప్రపంచాన్ని ఏదైనా వణికిస్తోంది అంటే అది కరోనా వైరసే. అలాంటి ఈ కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే 15 వేలకుపైగా మరణాలు సంభవించాయి.. 3 లక్షలమందికి పైగా ఈ కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ మన భారత్ లోకి ప్రవేశించి అతలాకుతలం చేస్తుంది. ఈ కరోనా వైరస్ బారిన పడి భారత్ లో ఇప్పటికే 9 మంది ప్రాణాలు విడిచారు. 

 

500మందికిపైగా ప్రజలు ఈ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రబుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ నెల 31 వరుకు ఎవరైన సరే ప్రజలు ఇంటి నుండి బయటకు వస్తే జైల్లో వెయ్యాలని.. ఎవరు బయటకు రాకూడదు అని సంచలన నిర్ణయం తీసుకున్నారు. 

 

దీంతో ప్రజలు ఎవరు ఇల్లు దాటి బయటకు రావడం లేదు.. ఐకపోతే ఈ కరోనా వైరస్ పై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని ఫేక్ ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయ్. ఇంకా ఇప్పుడు ఈ ఫేక్ ప్రచారాలు గ్రామాల్లో కూడా ప్రారంభమయ్యింది. అసలు ఆ వైరస్ మనది కాదే కాదు.. ఇంకా దానికి మన బాషా ఎం అర్థం అవుతుంది? చెప్పండి. 

 

అలాంటిది.. ఒక్కరు లేదా ఇద్దరు కొడుకులు ఉన్న తల్లులందరూ ఐదు ఇళ్ల నుంచి తీసుకొచ్చిన నీటిని వేప చెట్టుకు పోస్తే కరోనా రాదంటూ ప్రచారం జరుగుతోంది. దీన్ని నమ్మిన అమాయక మహిళలు.. ఒక్క కొడుకుంటే ఒక కొబ్బరికాయ.. ఇద్దరుంటే రెండు కొబ్బరి కాయలు వేప చెట్టుకు కొడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.           

మరింత సమాచారం తెలుసుకోండి: