ధనం దారిద్ర్యం ఒకే ఆకర్షిణ సూత్రంగా పనిచేస్తాయి. ఎవరైతే డబ్బును ఘాడంగా ప్రేమిస్తారో వారు ధనవంతులుగా మారుతారు. అయితే ఎవరైతే డబ్బును విపరీతంగా వాంచిస్తారో వారు నిరంతర దారిద్ర్యంతో కొనసాగుతూ ఉంటారు. ప్రేమించే మనస్తత్వం ఉన్న వ్యక్తిని మాత్రమే అందరు ప్రేమిస్తారు అన్న సూత్రానికి అనుగుణంగా డబ్బును ఎక్కువగా సంపాదించాలి అంటే ఆ డబ్బును ప్రేమించగలగాలి.


అంతేకాని డబ్బును వాంచించ కూడదు అలాంటి వ్యక్తులు దగ్గర డబ్బు నిలబడదు. అదేవిధంగా మానసిక జడత్వాన్ని కలిగి ఉన్న వ్యక్తి వద్ద ఎంత ప్రయత్నించినా డబ్బు నిలబడదు. అందుకే ధనవంతులు కావాలి అంటే ధన చైతన్యం ఉండి తీరాలి అని చెపుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ ప్రధాన లక్షణాలలో ఏ లక్షణం లోపించినా మనవద్ద డబ్బు నిలబడదు అని అంటారు. స్పష్టమైన ప్రయోజనం ప్రగాఢ వాంఛ స్వాలంబన ప్రణాళికలలో ఖచ్చితత్వం నిర్దిష్ట పరిజ్ఞానం సహకారం సంకల్ప బలం ఇలా ఈ అలవాట్లు అన్నీ కలిగి ఉన్న వ్యక్తి మాత్రమే ధనవంతుడుగా మారగాలుగుతాడు అని ప్రపంచ విఖ్యాత మనీ ఎక్స్ పర్ట్ కేట్ స్మిత్ అభిప్రాయపడుతున్నారు.


ముఖ్యంగా సంకల్ప బలం లేని వ్యక్తి ఎన్ని ప్రయత్నాలు చేసినా ధనవంతుడు కాలేడు. దీనికోసం తనకు ఏమి కావాలో తెలుసుకోవడం కోసం ఆ వ్యక్తిలో చాల అంతర్మధనం జరగాలి. అయితే తన తప్పులకు ఇతరులను నిందించడం తన జీవితంలో ఎదురయ్యే దురదృష్టకర పరిస్థితులను అనివార్యమైనవిగా రాజీపడే  వ్యక్తితం గల వ్యక్తులు ధనవంతులు కాలేరు. ముఖ్యంగా సంపదను సంపాదించాలి అని భావించే వ్యక్తి విమర్శలు అంటే భయపడే వ్యక్తిత్వం కలవాడుగా ఉండకూడదు.


అందుకే జీవితంతో రాజీపడే వ్యక్తులు దగ్గర డబ్బు ఉండదు. ముఖ్యంగా అవకాశాలను తనకు తగ్గట్టుగా మలుచుకునే నైపుణ్యం లేని వ్యక్తిని దారిద్ర్య చైతన్యం గల వ్యక్తిగా పరిగణిస్తారు. దీనితో మనకు ఉన్నది ధన చైతన్యమా దారిద్ర్య చైతన్యమా అన్నవిషయమై స్పష్టమైన అవగాహన ఉన్న వ్యక్తి మాత్రమే ధనవంతుడుగా మారగలుగుతాడు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: