సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాలు, క‌రోనా వ్యాప్తి విష‌యంలో జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా వేసిన అడుగులు పొరు గు రాష్ట్రం తెలంగాణ సీఎం కేసీఆర్‌కు నిద్ర ప‌ట్ట‌నివ్వ‌డంలేదు. దీనికితోడు.. మ‌రో కీల‌క విష‌యం కూడా ఆ యన‌కు కంటిపై కునుకు లేకుండా చేసింద‌ని అంటున్నారు ప‌రిశీలకులు. మొత్తానికి ఇప్పుడు క‌రోనా రెండో ద‌శ తెలంగాణ‌లో కొన‌సాగుతోంది. ఇది స్థానికుల‌కు సోక‌కుండా ఉండేందుకు ప్ర‌భుత్వం అనేక చ‌ర్య‌లు తీ సుకుంటోంది. దీనిలో భాగంగా.. ఆదివారం దేశం మొత్తం ఉద‌యం నుంచి రాత్రి 9 వ‌ర‌కు జ‌న‌తా క‌ర్ఫ్యూ చేప‌డితే.. కేసీఆర్ మాత్రం 24 గంట‌ల పాటు కొన‌సాగించారు

.

అంతేకాదు, దీనిని ఈ నెల మొత్తం కొన‌సాగించాల‌ని ఆదేశాలు జారీ చేశారు. అయినా కూడా రాష్ట్రంలో ప్ర‌జ లు రోడ్ల మీద‌కి వ‌చ్చారు. దీంతో నేరుగా సీఎస్‌, స‌హా డీజీపీని రంగంలోకి దింపి.. ప‌రిస్థితిని చ‌క్క‌బ‌రిచేందు కు ఆఘ‌మేఘాల‌పై స్పందించారు. మొత్తానికి సీఎంగా కేసీఆర్ ఇటీవ‌ల కాలంలో ఇంత హైరానా ప‌డిన సంద‌ర్భం అంటూ ఏమీ లేదు., అదే స‌మ‌యంలో ఏపీ సీఎం జ‌గ‌న్‌ను ప‌రిశీలిస్తే.. కేసీఆర్ దూకుడు ఆయ‌న‌లో క‌నిపించ‌డం లేదు. దీనికి రెండు కార‌ణాలు ఉన్నాయి. ఒక‌టి ముంద‌స్తుగానే జ‌గ‌న్ జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం, రెండు ల్యాబ్‌లు ఏర్పాటు చేయ‌డం, క్వారంటైన్ల‌ను ఏర్పాటు చేయ‌డం

.

ఇక‌, ఇప్ప‌టికీ.. పెద్ద‌గా ఎలాంటి కేసులు న‌మోదు కాక‌పోవ‌డం. ఒక‌రు పాజిటివ్ వ‌చ్చి కూడా ఇంటికి డిశ్చా ర్జ్ కావ‌డం వంటివి జ‌గ‌న్‌కు, ఏపీకి కూడా పెద్ద ఊర‌ట‌. అయితే, ఈ త‌ర‌హా ప‌రిస్తితి కేసీఆర్ కు లేదు. ఇక్క‌డ ఎవ‌రూ కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఇంటికి డిశ్చార్జ్ కాలేదు. పైగా కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో కేసీఆర్‌లో ఆవేద‌న క‌నిపిస్తోంది. అదేస‌మ‌యంలో ఐటీ న‌గ‌రంగా ఉన్న హైద‌రాబాద్‌కు ఇప్పుడు క‌రోనా ఎఫెక్ట్‌తో బ్యాడ్ నేమ్ వ‌స్తే..? అనే సందేహం కూడా కేసీఆర్‌ను వెంటాడుతోంది. ఈక్ర‌మంలోనే ఆయ‌న త‌గిన‌న్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ని, ఆందోళ‌న చెందుతున్నార‌ని అంటున్నారు. మొత్తానికి ఇన్నేళ్ల‌లో కేసీఆర్ ఆందోళ‌న వెనుక ఉన్న రీజ‌న్ ఇదేన‌న్న మాట‌..!

మరింత సమాచారం తెలుసుకోండి: