బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్... కరోనా వైరస్ కారణంగా బ్యాంకింగ్ వ్యవస్థపై కూడా అనేక రకాల ప్రతికూల ప్రభావం పడింది. దీనితో బ్యాంకులు పూర్తి సేవలను బ్రాంచుల్లో సర్వ్ చేయలేకపోతున్నాయి. ఎక్కువ ముఖ్యమైనవి కాని సేవలను బంద్ చేసినట్లు అన్ని బ్యాంకులు ఇప్పటికే చెబుతున్నాయి. అలాగే బ్యాంకు లో ఉన్న సిబ్బంది సంఖ్యను కూడా కొద్దీ వరకు తగ్గించినట్లు తెలుస్తుంది. వీలు అయినంతవరకు ఆన్‌లైన్ సర్వీసులను ఎక్కువగా వాడుకోవాలని కస్టమర్లను బ్యాంకులు కోరుతున్నాయి.

 

 


ఇది ఇలా ఉండగా hdfc, ICICI బ్యాంక్ లు ఇప్పటికే బ్యాంక్ వర్కింగ్ టైమింగ్స్‌ ను కూడా మార్చాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పనిచేస్తున్నాయి. ఇప్పుడు AXIS బ్యాంకు మరో బ్యాంక్ ఒక అడుగు ముందుకేసి IMPS చార్జీలు తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దేశంలోని మూడో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ AXIS బ్యాంక్ కేవలం IMPS చార్జీలు మాత్రమే కాకుండా ఏటీఎం ట్రాన్సాక్షన్లపై కూడా చార్జీలను తీసేసినట్లు తెలిపింది. ఈ సందర్బంగా AXIS బ్యాంక్‌ లో సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకైంట్ కలిగిన వారికి ప్రిపెయిడ్ కార్డు ఉన్న వారికి ఈ ప్రయోజనం వారికి వర్తిస్తుంది. అయితే ఈ సదుపాయాన్ని AXIS బ్యాంక్ కస్టమర్లు మార్చి 31 వరకే ఉపయోగించుకోగలరు. AXIS బ్యాంక్ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తన వంతు భాగంగా రూ.100 కోట్లు వరకు ఖర్చు పెట్టనుంది.

 

 


 అలాగే కస్టమర్లు బ్యాంక్‌కు రావడాన్ని తగ్గించుకొని పూర్తిగా డిజిటల్ సేవలను ఎక్కువగా వాడుకోవాలని బ్యాంకు CEO అమితాబ్ చౌదరీ కోరారు. కచ్చితంగా అవసరం ఉంది అనుకుంటే మాత్రం తప్ప బ్యాంక్‌ కు రావొద్దని ఆయన ప్రజలకు సూచించారు. తమ బ్యాంకు కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడం కోసం వివిధ లావాదేవీలపై చార్జీలను తొలిగిస్తున్నామని తెలిపారు. అలాగే AXIS బ్యాంక్ ATM చార్జీల ఎత్తివేత్తలో ఈ బ్యాంకు దారిలోనే మరిన్ని బ్యాంకులు నడిచే అవకాశముందని కొందరు మార్కెట్ నిపుణులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: