ప్రతిరోజు దేశంలో ఎక్కడో అక్కడ అత్యాచారాల కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ప్రపంచ అంతా కరోనా మహ్మారితో భయపడి పోతుంటే కామాంధుల్లో మాత్రం మహిళలపై అత్యాచారం చేయాలన్న కోరికతో రగిలిపోతున్నారు.  ప్రస్తుతం దేశం మొత్తం లాక్ డౌన్ అమల్లో ఉంది. కానీ కొంత దుర్మార్గులు కామంతో రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్‌గురిలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి యత్నించారు. చాకచక్యంగా వ్యవహరించిన బాధితురాలు ఓ కామాంధుడి నాలుకను గట్టిగా కొరికి రెండు ముక్కలు చేసింది. బాధతో విలవిల్లాడిన నిందితుడు ఆమెను వదిలేసి ఆస్పత్రికి పరుగు తీశాడు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 

ఓ వైపు కరోనా బాధకు అందరూ ఇంటి పట్టున ఉండాలని ప్రభుత్వాలు చెబుతుంటే.. ఈ కామంధులు మాత్రం తమ కోరిక తీర్చుకునేందుకు ప్రయత్నించి భంగపడ్డారు.   ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశంలో అందరూ జనతా కర్ఫ్యూ పాటించారు.  ఇదే సమయంలో రాత్రి 8 గంటల ప్రాంతంలో ఓ మహిళపై రాకీ మొహమ్మద్, చోతు మొహమ్మదుల్లా అనే ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి యత్నించారు. ఆమెను బంధించి బెడ్రూమ్‌లోకి లాక్కెళ్లిన ఇద్దరు నిందితులు తీవ్రంగా కొట్టారు. రాకీ ఆమెపై అత్యాచారానికి పాల్పడుతుండగా బాధితురాలు అతడికి ఎలాగైనా బుద్ది చెప్పాలన్న కోపంతో నాలుకను గట్టిగా కొరికేసింది. అంతే ఒక్కసారే బాధతో విల విలలాడుతూ.. దగ్గరలోని ఆసుపత్రికి పరుగులు తీశాడు బాధితుడు.

 

తెగిన నాలుక ముక్కను డాక్టర్ వద్దకు తీసుకు వెళ్లగా అది అదికించడం కుదరదని తేల్చి చెప్పారు. నాలుకు అతికించమని ఎంత ప్రదేయ పడ్డా కుదరదని చెప్పడంతో   తీవ్ర రక్తస్రావంతో ఆ కామాందుడు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ఇలాంటి దుర్మార్గులకు తగిన శాస్తి జరిగిందని నెటిజన్లు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: