పరిపాలనలో భాగంగా తీసుకునే నిర్ణయాల్లో జగన్మోహన్ రెడ్డి తన దూకుడును తగ్గించాల్సిందే.  లేకపోతే న్యాయస్ధానాల నుండి మొట్టికాయలు పడుతునే ఉంటాయనటంలో సందేహం లేదు. సోమవారం ఒక్కరోజే ఐదు కేసుల్లో హై కోర్టు ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆక్షేపించటం గమనార్హం. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు మంచి చేస్తాయా లేకపోతే చెడు చేస్తాయా అన్న విషయాన్ని పక్కనపెట్టేద్దాం. జగన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయంపైనా చంద్రబాబునాయుడు కోర్టుల్లో కేసులు వేయిస్తు చికాకు పెడుతున్న విషయాన్ని గమనించాలి.

 

ప్రభుత్వ కార్యాలయాలకు, పథకాలకు వైసిపి రంగులు వేయటాన్ని కోర్టు చాలా తీవ్రంగా పరిగణించి జగన్ కు అక్షింతలు వేసింది. నిజానికి ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగలు వేయటం తప్పే. అయితే ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయాలన్న నిర్ణయం జగన్ తీసుకున్నాడని అనుకునేందుకు లేదు. క్రిందస్ధాయిలో ఎవరో తీసుకున్న నిర్ణయానికి జగన్ బాధ్యత వహించాల్సొచ్చింది. అలాగే రాజధాని ప్రంతంలో ప్రభుత్వం పేదలకు ఇళ్ళ స్ధలాలను కేటాయించటాన్ని కూడా కోర్టు తప్పు పట్టింది.

 

అలాగే విశాఖపట్నం జిల్లాలో పేదలకు ఇళ్ళ స్ధలాల సేకరణను కూడా కోర్టు నిలిపేసింది. రైతులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా వాళ్ళు భూములను ఎలా సేకరిస్తారంటూ నిలదీయటమే విచిత్రంగా ఉంది. అదేవిధంగా పాతిక లక్షల మందికి పంపిణి చేయటానికి ప్రభుత్వం స్ధలాలను రెడీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పట్టాలను ఐదేళ్ళ తర్వాత అమ్ముకోవచ్చు లేదా కుదవపెట్టవచ్చని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా కోర్టు తప్పుపట్టింది.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కార్యాలయాలకు పార్టీ రంగలు వేయటంపై టిడిపి కోర్టుకెళ్ళింది. తమ హయాంలో కార్యాలయాలకు రంగులు వేయకపోయినా సంక్షేమ పథకాలకు పసుపు రంగులు వేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.  అప్పట్లో ప్రతిపక్షాలేవి కోర్టుకెళ్ళలేదు. ఇపుడు దాన్నే బూతద్దంలో చూపించి టిడిపి కేసులు వేసింది. ఇక రాజధాని కోసం చంద్రబాబు ఏ విధంగా భూములు సేకరించారో అందరికీ తెలిసిందే. అప్పట్లో బలవంతపు భూ సేకరణపై రైతులు కోర్టుకెళితే పట్టించుకోనే లేదు.

 

ఇపుడు పంపిణి చేయబోతున్న ఇళ్ళ పట్టాలను ఐదేళ్ళ తర్వాత అమ్ముకోవచ్చు లేదా కుదవపెట్టుకోవచ్చనే వెసులుబాటు ఇవ్వటం మాత్రం తప్పే. అసలు ఎలాగూ ప్రభుత్వం నుండి తీసుకునే పట్టాలను చాలామంది అమ్మేసుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది ప్రత్యేకంగా ప్రభుత్వమే వెసులుబాటు కల్పించాల్సిన అవసరమే లేదు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: