మనకున్న సోషల్ మీడియా మామూలుది కాదు బాసు.. కరోనా వైరస్ కంటే చాలా ఫాస్టుగా ఉంది.. ఎందుకంటే దేశం అంతా కరోనా అంటూ కలవరిస్తుంటే కొందరు పని పాటలేని మనుషులు మాత్రం పనికిమాలిన ఐడియాలన్ని పోస్టు చేస్తూ టైంపాస్ చేస్తున్నారు.. ఇక కరోనా వ్యాప్తి మొదలు పెట్టినప్పటి నుండి ఎన్ని రకాలుగా ప్రజలను హింసిస్తున్నారంటే.. ఇది తింటే కరోనా రాదు.. అది చేస్తే కరోనా వెళ్లిపోతుంది.. అంటూ వీరికేదో స్వయంగా బ్రహ్మ వచ్చి చెప్పినట్లుగా ప్రచారాలు చేసుకుంటున్నారు..

 

 

ఒక వేళ వీరు చెప్పినట్లుగా చేస్తే కరోనా తగ్గితే మంచిదే కానీ అది నిరూపించాలి కదా.. నిరూపణలేని ఆరోపణలు చేస్తూ, ప్రజల ఆశతో ఆటలాడుతున్నారు.. వీళ్ళూ చెప్పేది కనుక నిజమైతే ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు.. ముందుగా ఇలాంటి వారి ప్రాణాలు కాపాడండి.. ఆ తర్వాత మీరు చెప్పేది సొల్లా లేక దమ్మున్న నిజమా అని తెలుస్తుంది. అంతే కానీ కల్లబొల్లి మాటలు, కాకమ్మ కబుర్లు చెబుతూ ఇలా టైం పాస్ చేసేవారిని చాకలిబండకు బట్టలేసి ఉతికినట్లుగా ఉతికితే సరి..

 

 

మీరు చెప్పే మాటలు, చిట్కాలు కొన్ని లక్షల మంది ఆశలు.. అదే నిజమనుకుని పొరబడి అలాచేసి దైర్యంగా రోడ్లమీద తిరిగి కరోనా అంటించుకుంటే మరింత ప్రమాదం కలిగే అవకాశాలున్నాయి.. ఇదిగో ఇలాగే ఒకతను కరోనా కళ్లు తాగితే రాదనే ప్రచారం చేస్తున్నాడు.. ఇది సమయం కాదనే ఆలోచన కూడా కలగడం లేదా.. ఈ మనుషుల బుద్ధులు గొర్రెలకంటే దారుణంగా ఉన్నాయి.. అవి చదువుకోలేక, మాటలు రాక ఇలా ప్రవర్తిస్తే అన్నీ తెలిసిన మనుషులు మాత్రం బుర్రతక్కువగా బ్రతుకుతున్నారు.. ఇక ప్రజలు కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండడానికి ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించి అందరూ ఇళ్లకు పరిమితం కావాలని, బయట తిరగవద్దని సూచించింది. దీంతో నిత్యవసర వస్తువుల దుకాణాలు, ఆస్పత్రులు, మెడికల్‌ షాపులు మినహా అన్నీ బంద్‌ అయ్యాయి.

 

 

ఇలాంటి క్రమంలో నిడమనూరు మండలంలోని శాఖాపురంలో దోసపాటి అంజయ్య గౌడ్‌ అనే వ్యక్తి కల్లు కరోనా రాకుండా చేస్తుంది.. అనే సందేశం వచ్చేలా ‘రేఖ పట్టు–కరోనా పనిపట్టు’ అని బోర్డు పెట్టి పలువురిని ఆకట్టుకుంటున్నాడు. మద్యం దొరకకపోవడం.. కరోనా వైరస్‌ నివారణకు కల్లు అని ప్రచారం కావడంతో కల్లు తాగడానికి జనం పరుగులు తీస్తున్నారు. కరోనా వైరస్‌ కట్టడికే కల్లు తాగుతున్నామంటూ వయోభేదం లేకుండా తాటి వనాల వైపు పరుగులు తీస్తున్నారట.. ఇక కళ్లుతాగితే కరోనా రాదనే ముచ్చట పక్కన పెడితే అక్కడ ఎవడైనా కరోనా వచ్చిన వాడు వస్తే అందరి దూల తీరిపోద్ది.. కనీసం ఇలాంటి సమయాల్లో అయినా ఒళ్లు దగ్గరపెట్టుకుని బ్రతకండని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: