కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించటంలో భాగంగా చంద్రగిరి వైసిపి ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వినూత్నమైన పద్దతిని పాటిస్తున్నాడు. కరోనా వైరస్ నియంత్రణకు నియోజకవర్గం మొత్తం మీద శానిటైజర్ బాటిళ్ళను పంపిణి చేస్తున్నారు. నియోజకవర్గంలోని తుమ్మలగుంట ప్రాంతంలో బాటిళ్ళ పంపిణిని స్వయంగా ఎంఎల్ఏనే మొదలుపెట్టాడు. ప్రతి ఇంటికి 2 బాటిళ్ళని పంపిణి చేయటంలో భాగంగా సుమారు 3.4 లక్షల శానిటైజర్ బాటిళ్ళను పంపిణి చేస్తున్నాడు.

 

చెవిరెడ్డి మొదటి నుండి కూడా నియోజకవర్గంలో వినూత్నమైన పథకాలతో జనాల్లో దూసుకుపోతున్న విషయం అందరూ చూస్తున్నదే. రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుండి ప్రజాసమస్యలపై వెంటనే స్పందించే గుణం చెవిరెడ్డిలో ఎక్కువగానే ఉంది. అందుకనే ప్రతిపక్షంలో ఉన్నపుడు టిడిపి ప్రభుత్వంపై ఐదేళ్ళల్లో అనేక పోరాటాలు చేశాడు. వేసవి కాలంలో మంచినీరు అందని గ్రామాల్లో సొంత నిధులతోనే మంచినీటి సరఫరా కార్యక్రమాన్ని చేపట్టాడు.

 

అలాగే ఎంఎల్ఏ నిధులకు అదనంగా మరికొన్ని నిధులను సమకూర్చి మారుమూల గ్రామాల్లో రోడ్లు వేయించటం, ఇళ్ళు నిర్మించటం, మంచినీటి సరఫరా వ్యవస్ధను మెరుగుపరచటం లాంటి అనేక చర్యలు చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడూ జనాల్లో ఉండే వ్యక్తి కాబట్టే జనాలు కూడా వరుసగా చెవిరెడ్డికే ఓట్లు వేసి గెలిపిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు ఎంతగా ప్రయత్నంచేసినా  టిడిపిని తిరస్కరించారు.

 

తాజాగా కరోనా వైరస్ నియంత్రణకు కూడా నియోజకవర్గంలోని ఆసుపత్రుల్లో ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేయటంలో కృషి చేశాడట. ఇపుడేమో శానిటైజర్ బాటిళ్ళను పంచిపెడుతున్నాడు. సామాజిక బాధ్యతగా శానిటైజర్ బాటిళ్ళను పంచుతునే పనిలో పనిగా తన ప్రచారం కోసం జగన్మోహన్ రెడ్డితో ఉన్న తన ఫొటోను  కూడా ముద్రించుకున్నారు. అంటే స్వామి కార్యంతో పాటు స్వకార్యమన్నమాట.

==

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: