కరోనా దెబ్బతో ప్రపంచంలో నలుమూలల ఉన్న ఇండియన్లు ఇబ్బంది పడుతున్నారు. అక్కడి దేశాలు వాళ్లను ఉంచుకోక.. మన దేశానికి రాలేక నలిగిపోతున్నారు. మొన్ననే ఓ బ్యాచ్ ఫిలిప్పీన్స్ నుంచి ఇండియా చేరుకుంది. అందుకు అష్టకష్టాలు పడింది. ఇప్పుడు లండన్‌ లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

 

 

లండన్ లో చిక్కుకు పోయిన భారతీయ విద్యార్ధులు ఇప్పుడు అక్కడ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందవలసి వస్తోంది. ఇలా చిక్కుకుపోయిన వారిలో ఎక్కువ మంది తెలంగాణవారు ఉన్నారని తెలుస్తోంది. వారు విమాన టిక్కెట్లు బుక్ చేసుకున్నప్పటికీ 22 నుంచి అంతర్జాతీయ విమానాలను భారత్ అనుమతించడం లేదు.

 

 

ఈ రోజు అర్థరాత్రి నుంచి విమాన రాకపోకలను కూడా క్లోజ్ చేసేశారు. దీంతో వారు అక్కడ చిక్కుకుపోయారు. 59 మంది విద్యార్దులు ఎయిర్ పోర్టులో చిక్కుపడ్డారు. అయితే.. బ్రిటన్ లోని ప్రవాస భారతీయులు వారిలో పలువురికి ఆశ్రయం కల్పిస్తున్నారు. కానీ 19 మంది విద్యార్థులు మాత్రం అందురు ఒప్పుకోలేదని తెలుస్తోంది.

 

 

ఇక చేసేది లేక వారు భారతీయ రాయబార కార్యాలయంలో తాత్కాలిక వసతిలో సర్దుకుంటున్నారు. ఎంబీసీలోనే తమ బ్యాగేజీతో ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితులు పలుదేశాల్లో ఇండియన్లు ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ పలు దేశాలకు వివిధ కారణాలతో వలస వెళ్లిన ఇండియన్ల పాలిట శాపంగా మారింది. అయితే వీరంతా కరోనా ఉధృతిని ముందుగా అంచనా వేయలేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: