క‌రోనా విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంద‌ని ఏపీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు స్ప‌ష్టం చేశారు. ఇక ఇప్ప‌టికే విశాఖ‌ప‌ట్నంలో క‌రోనా రెండో ద‌శ‌కు వ‌చ్చేసింది. ఇందులో ప్ర‌జ‌లు క‌రోనా విష‌యాన్ని ప‌ట్టించుకోక పోవ‌డం కూడా ఓ ప్ర‌ధాన కార‌ణంగా ఏపీ ప్ర‌భుత్వం భావిస్తోంది. అదే టైంలో ప్ర‌భుత్వం ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా ప్ర‌తిప‌క్షాల నుంచి ఏదొ ఒక విమ‌ర్శ‌లు రావ‌డం స‌హ‌జం. మంగ‌ళ‌వారం ఉద‌యం ప్రెస్‌మీట్ పెట్టిన చంద్ర‌బాబు విదేశాల నుంచి వ‌చ్చిన వారి విష‌యంలో ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించింద‌ని.. వారి విష‌యంలో ముందు నుంచి క్వారైంటైన్ చేయ‌లేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

 

ఇక ఒక్కొక్క‌రికి రు. 5 వేలు ఇవ్వాల‌ని కూడా బాబు చెప్పారు. దీంతో ఏపీ మంత్రులు విశాఖ‌లో జ‌రిగిన ప్రెస్‌మీట్లో మాట్లాడారు. ముందుగా సంబంధిత మంత్రి అయిన ఆళ్ల నాని మాట్లాడిన అనంత‌రం వ్య‌వ‌సాయ శాఖా మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు మాట్లాడారు. క‌రోనాను సైతం ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు రాజ‌కీయం చేయ‌డం త‌గ‌ద‌ని మంత్రి మండిప‌డ్డారు. విశాఖ‌లో ఆయ‌న వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నానితో పాటు జిల్లా మంత్రి అవంతి శ్రీనివాస్‌తో క‌లిసి ప్రెస్‌మీట్ నిర్వ‌హించారు. ఇప్ప‌టికే క‌రోనా క‌ట్ట‌డికి ఏపీ ప్ర‌భుత్వం ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంద‌ని.. ఇంకా తీసుకుంటామ‌ని ఆయ‌న చెప్పారు.

 

ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగుల‌కు జీతాలు క‌ట్ చేస్తే తాము చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కూడా ప్ర‌క‌టించాము. మేం ఎంతో బాధ్య‌త‌తో ప‌ని చేస్తుంటే చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌ను దృష్టి మళ్లించే ప్ర‌య‌త్నం చేయ‌డంతో పాటు ఏదో అభూత క‌ల్ప‌న‌లు క్రియేట్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని మంత్రి మండిప‌డ్డారు. ఇక ఇప్ప‌టికే సీఎం జ‌గ‌న్ పేద‌ల‌కు రేష‌న్ ఇవ్వ‌డంతో పాటు ప్ర‌తి రేష‌న్ కార్డుకు రు. 1000 ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించార‌ని.. అవ‌స‌రం అయితే ఇవి మ‌రింత పెంచుతామ‌ని ఇప్ప‌టికే ... ఈ విష‌యంలో చంద్ర‌బాబు సూచ‌న‌లు చేయ‌కుండా ఇలా రాజ‌కీయం చేయ‌డం త‌గ‌ద‌ని ఆయ‌న సూచించారు.

 

బాబు ఇప్ప‌టికే తీవ్రంగా మ‌ద‌న ప‌డుతూ ఉంటార‌ని.. ఈ ప‌రిస్థితుల్లో తాను ఉంటే దోమ‌ల‌పై దండ‌యాత్ర‌.. క‌రోనాపై క‌త్తియుద్ధం అంటూ ప్ర‌క‌ట‌న‌లు చేస్తుంటార‌ని.. అంత ప‌బ్లిసిటీ పిచ్చ ఈ ప్ర‌భుత్వానికి లేద‌ని ఆయ‌న స్ప‌స్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: