కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు కఠిన నింబంధన లు అమలు చేస్తున్నాయి.   దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్  విధించాయి. అత్యవసరం ఉంటే తప్ప ఎవరూ బయట తిరగొద్దని హెచ్చరికలు జారీ చేశాయి. కరోనా వైరస్ విస్తరించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే, లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ చాలా మంది ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. భారత్ లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ఈరోజుకు దేశ వ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు 500కి చేరుకున్నాయి. నిన్న ఒక్క రోజే 99 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 

 

లాక్ డౌన్ హెచ్చరికలను పెడచెవిన పెడూతూ అనేక మంది రోడ్లపైకి వస్తున్నారు. ఇలాంటి వ్యక్తులపై పోలీసులు చర్యలకు ఉపక్రమిస్తున్నారు.  లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలను జారీ చేసింది. అవసరమైతే చట్ట ప్రకారం కర్ఫ్యూని విధించాలని సూచించింది. కర్ఫ్యూ అమల్లోకి వస్తే... ఎవరూ కూడా రోడ్లపై కనిపించడానికి కూడా వీలుండదు. ఎవరైనా రోడ్లపైకి వస్తే పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. కోల్ కతాలో నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన 255 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

 

ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం వీరిని అదుపులోకి తీసుకుని కేసులను నమోదు చేశారు. పశ్చిమబెంగాల్ లో ఇప్పటి వరకు 7 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకర చనిపోయిన విషయం తెలిసిందే.  ప్రభుత్వం ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై కఠిన చట్టాలు తీసుకోక తప్పదని... ప్రస్తుతం కరోనా విపత్తు కొనసాగున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో ఉండాలని తమ ఆరోగ్య బాధ్యత తమపైనే ఉందని అంటున్నారు అధికారులు.  లాక్ డౌన్ ఉపేక్షిస్తే జైలుకు వెళ్లక తప్పదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: