నిర్లక్ష్యం నిబద్ధత లేకపోవడం వెరసి  చాలా మంది ప్రజలు స్వయంగా కరోనా వైరస్ వ్యాప్తికి కారణం అవుతున్నారు. చదువుకున్న వారు... విజ్ఞానవంతులు... వైరస్ గురించి పూర్తి అవగాహన ఉన్నవారు కూడా... ప్రభుత్వం సూచిస్తున్న నిబంధనలను పెడచెవిన పెడుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. భారతదేశంలో అందరినీ బెంబేలెత్తిస్తున్న కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లో కూడా విజృంభిస్తూ  ప్రాణ భయాన్ని  కలిగిస్తున్న విషయం తెలిసిందే. అయితే మొన్నటి వరకూ కేవలం విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే పరిమితం అయిన ఈ మహమ్మారి... ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా సోకుతుంది దీంతో తెలుగు రాష్ట్రాల్లో కరోనా  వైరస్ వ్యాప్తి  మూడవ దశ ప్రారంభం లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో  నాలుగవ దశ వచ్చింది అంటే పరిస్థితి చేయి దాటిపోయింది. 

 

 

 ఇక ఈ విషయాన్ని అర్థం చేసుకున్నా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు.. ఎన్నో కఠిన నిబంధనలను అమలు చేస్తూ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నా విషయం తెలిసిందే. ఈ కరోనా వైరస్ ను నియంత్రించేందుకు ప్రజలు కేవలం ఇంటికే పరిమితం అయ్యేలా ఉండేందుకు వేల కోట్లు ఖర్చు పెడుతున్నాయి ప్రభుత్వాలు. అయితే కరోనా వైరస్ను తెలుగు రాష్ట్రాల్లో  పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు... తాజాగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్  ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ప్రజలందరూ ఇంటికే పరిమితం కావడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతుంది అని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు భావించాయి. 

 

 

 దీని కోసం ఏకంగా  ప్రభుత్వాలు వేల కోట్లు ఖర్చు పెడుతున్నాయి. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా.. ప్రభుత్వ ప్రయత్నాలు నీటిలో  పోసిన పన్నీరుగా వృధా అయిపోతున్నాయి. లాక్ డౌన్ విధిస్తూ రవాణా వ్యవస్థ ను మూసి వేస్తూ... అన్ని దుకాణాలు, షాపింగ్ మాల్స్,  సినిమా థియేటర్లు మూసివేసి కఠిన నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ... ప్రజలు మాత్రం పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదు. ప్రభుత్వ నిబంధనలను లెక్కచేయకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తూ నిర్లక్ష్యంగా రోడ్ల మీదికి వస్తున్నారు. అటు ప్రాణాలకు తెగించి మరి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రోడ్లమీద చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తూ ప్రజలను ఇంటికి వెళ్ళమని పోలీసులు వేడుకుంటున్న ప్రజల తీరులో మాత్రం మార్పు రావడంలేదు. 

 

 

 రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే జరగకూడదని వేల కోట్లు ఖర్చు పెట్టడానికి  సిద్ధం అయ్యాయో.. అదే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరగడం లేదు. అసలు లాక్ డౌన్  ప్రజలు ఎవరూ పాటించడం లేదు. ఆ వైరస్ మన దగ్గరికి రాదులే అని నిర్లక్ష్యం చేస్తున్నారా... లేదా వారికి ఉన్న వైరస్ ఇంకొకరికి కూడా అంటించాలి అనే ఉద్దేశంతో బయట తిరుగుతున్నారా అనే ఈ విధంగా ఉంది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు. ఎంతో అభివృద్ధి చెందిన దేశాలైన ఇటలీ అమెరికా స్పెయిన్ లాంటి దేశాలలో రోజురోజుకు చేయి దాటి పోతున్నా పరిస్థితులను చూసి కూడా తెలుగు రాష్ట్రాల ప్రజల్లో  కనీసం కొంతైనా మార్పు రావడంలేదు. 

 

 

 అయితే ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నపటికీ... ప్రజల నుంచి సరైన సహకారం లేకపోతే మాత్రం.. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అది వృధా అవుతుంది. ఇక ఆ తర్వాత మారణహోమం తప్పదు అని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే... అసలు తెలుగు వాళ్ళకి నిబద్ధత ఉందా లేదా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకు అంతలా బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారు..? పొరుగు రాష్ట్రాలలో జరుగుతున్న పరిణామాలను చూసైనా బుద్ధి తెచ్చుకోరా..? అంటూ విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల ప్రజలు కళ్ళు తెరిచి ప్రభుత్వం విధించిన నిబంధనను తు.చ తప్పకుండా పాటించాలని లేనిపక్షంలో... లాక్ డౌన్  విధించి ఎన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చిన.. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా.. ప్రస్తుతం ఇటలీ దేశానికి పట్టిన దుస్థితి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు పట్టడం ఖాయం అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: