ఓ వైపు కరోనా భయం అందరినీ వణికిస్తోంది. ఈ దెబ్బతో రాష్ట్రాలకు రాష్ట్రాలే లాక్ డౌన్ ప్రకటించేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఏపీ సర్కారు మార్చి నెలాఖరు వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో విద్యార్థులకు నేరుగా ఇళ్లవద్దే ‘జగనన్న గోరుముద్ద ’ కింద మధ్యాహ్న భోజనం అందించేందుకు ఏపీ సర్కారు చర్యలు తీసుకుంటోంది.

 

 

విద్యార్థులకు ఇళ్లకు వెళ్లి బియ్యం, చిక్కీ, కోడిగుడ్లు పంపిణీ చేయాలని జగన్ ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్ల ద్వారా 31వ తేదీ వరకూ విద్యార్థులకు ఇళ్ల వద్దకే జగనన్న గోరు ముద్ద పంపిణీ చేయనున్నారు. మధ్యాహ్నం భోజనం లేక విద్యార్థులు ఇబ్బందిపడకుండా జగన్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. వాలంటీర్లు ఈ వారం పాటూ స్కూల్ విద్యార్థులకు జగనన్న గోరు ముద్దు అందించేలా ఏపీ అధికారులు సన్నాహాలు చేశారు.

 

 

ఇప్పటికే ఏపీలో పాఠశాల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం కింద ‘జగనన్న గోరుముద్ద ’ పేరుతో పోషకాహారం అందిస్తున్నారు. సోమవారం అన్నం, పప్పుచారు, కోడి గుడ్డు కూర, చిక్కీ ఇస్తున్నారు. మంగళవారం: పులిహోర, టమాట పప్పు, ఉడకబెట్టిన గుడ్డు అందిస్తున్నారు. బుధవారం వెజిటబుల్ రైస్, ఆలూ కుర్మా, ఉడకబెట్టిన గుడ్డు, చిక్కీ ఇస్తున్నారు.

 

 

ఇక గురువారం కిచిడీ, టమాటా చట్నీ, ఉడకబెట్టిన గుడ్డు అందిస్తున్నారు. శుక్రవారం అన్నం, ఆకుకూర పప్పు, ఉడకబెట్టిన గుడ్డు, చిక్కీ ఇస్తారు. శనివారం అన్నం, సాంబార్, తీపి పొంగలి ఇస్తున్నారు. కరోనా కారణంగా విద్యార్థులు బలవర్థకమైన ఆహారం నష్టపోకుండా ఏపీ సర్కారు ఈ చర్యలు తీసుకుంటోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: