జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కరోనా వైరస్ ని అరికట్టలేని మోడీ పరిపాలన ని తీవ్రంగా విమర్శించారు. దేశంలోని కరోనా కేసుల సంఖ్య 500 దాటుతున్న క్రమంలో రాహుల్ గాంధీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి రాహుల్ గాంధీ ఫిబ్రవరి నెల నుండే కరోనా వైరస్ వ్యాప్తి పై సీరియస్ గా ఆలోచించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారని... కానీ మోడీ మాత్రం 'నేను సోషల్ మీడియా డిలీట్ చేస్తున్నా' అంటూ ఎవడికీ పనికిరాని పోస్టులు పెట్టి అందరి సమయాన్ని వృధా చేశారని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శించారన్న సంగతి తెలిసిందే.



ఇతర దేశాల్లో కరోనా మహమ్మారి విపరీతంగా విజృంభిస్తుందని తెలిసి కూడా విమానాశ్రయాలను నిలిపివేయకుండా (వుహాన్ నుండి విద్యార్థులను) విదేశాల నుండి వచ్చే వారిని భారతదేశంలోకి ఏ కనీస జాగ్రత్తలు తీసుకోకుండా అనుమతించి కరోనా కేసులు నమోదు అయ్యేందుకు మోడీ సర్కార్ కారణమయ్యిందని సుబ్రతా ముఖర్జీ అన్నారు. కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు ప్రజలకు ముందస్తు జాగ్రత్తలను తెలపకుండా చాలా ఆలస్యం చేశారని... అందుకే ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు.





నిన్న ఒక సర్కారీ డాక్టర్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం తమకి కరోనా వైరస్ కేసులను టెస్ట్ చేసేందుకు ఒక్క మాస్క్ గానీ ఓ జత చేతి గ్లోవ్స్ గానీ ఇవ్వలేదని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. చప్పట్లు కొట్టడం, గిన్నెలు వాయించడం కాదని వీలైతే మెడికల్ కిట్లను అందించాలని ఆయన కోరారు. ఐతే రాహుల్ గాంధీడాక్టర్ పోస్ట్ కి స్పందిస్తూ... 'నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే భారతదేశంలో కరోనా మహమ్మారి విస్పోటనం పూర్తిగా నివారించదగినది. 2 నెలల క్రితం మనకి దీనిని ఎదుర్కొనే సమయం చాలా ఉంది. అప్పుడే మనం ఈ ముప్పును మరింత తీవ్రంగా పరిగణించి... సిద్ధంగా ఉండాల్సింది' అని ఆయన పేర్కొన్నారు.



ఇకపోతే మంగళవారం నాటికి దేశంలో 527 కరోనా కేసులు నమోదు కాగా, 10 మంది కరోనా రోగులు చనిపోయారు. ఇండియాలో రోజుకి 8000 టెస్టులు నిర్వహించేంత సామర్ధ్యమున్న కేవలం 90 కరోనా టెస్ట్ లు మాత్రమే జరుగుతున్నాయని, ఎక్కువ మందిని టెస్ట్ చేయాలంటే నూతన ల్యాబ్ లు, కిట్లు ఎంతైనా అవసరమని చాలామంది అభిప్రాయపడుతున్నారు. భారతీయ విమానాశ్రయాలలో కరోనా వైరస్ టెస్టులు చేసిన డాక్టర్లు... ప్రయాణికులందరినీ కలిపి ఓకే హాలులో కూర్చోబెట్టారని... ఆ హాలులో కొంతమంది జలుబు తో ఉన్నారని... మిగిలిన వారు మాత్రం ఆరోగ్యంగానే ఉన్నారని... ఇలా చేస్తే వైరస్ సోకని వారికి కూడా వైరస్ సోకుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. కనీసం టెస్టులని సక్రమంగా నిర్వహించకుండా అందరి చేతులపై 'స్వీయ నిర్బంధం లోకి వెళ్ళండి' అనే ముద్ర వేసి పంపించేస్తారని ఆయన తెలిపారు.





ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా చిన్నాచితకా వ్యాపారులు, ఆటో డ్రైవర్లు ఇల్లు గడవక నానా అవస్థలు పడుతున్నారని మరికొంతమంది నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయటనుండి వచ్చేవారిని కట్టడి చేసే పరిస్థితి లో ప్రభుత్వాలు లేకపోవడమే ఇప్పుడు 10 మంది మరణానికి, వేల మంది చిన్న వ్యాపారాలు నష్టపోవడానికి కారణం అని ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీల పై దుమ్మెత్తి పోస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: