భూమిని గడగడలాడించే వస్తున్న కరోనా నియంత్రణలో భారతదేశంలో ఏ రాష్ట్రము చేయనిది ఏపీ సీఎం జగన్ చేయగలిగారు. ప్రపంచంలో 179 దేశాలలో కరోనా వైరస్ వ్యాప్తి హడలెత్తిస్తున్న ఈ సంగతి అందరికీ తెలిసినదే. దాన్ని నియంత్రించేందుకు మందు లేక ముందస్తు చర్యల కోసం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నారు. ఎన్ని చర్యలు తీసుకున్న గ్రామీణ క్షేత్రస్థాయిలో దాని వ్యాప్తి చెందకుండా నియంత్రించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అది చేయగలిగింది. ఒక్కొక్క ఇంటిని జల్లెడపట్ట కలిగింది. ఏ ఇంటిలో కరోనా వైరస్ లక్షణాలు కలిగిన వ్యక్తి ఉన్నారో గుర్తించగలిగింది.

 

దేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రం వల్ల కానిది జగన్ ప్రభుత్వం వల్ల అయింది. అదెలా అనుకుంటున్నారా...? ఇది ముమ్మాటికి జగన్ సృష్టించిన గ్రామ సచివాలయ వార్డు  వ్యవస్థ వల్ల సాధ్యమైంది. ఏపీలో కరోనా నియంత్రణ కోసం అనేక చర్యలు చేపట్టారు. ప్రధానంగా ఈ వైరస్ విదేశాల నుండి వచ్చే వాళ్లు వల్ల వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున వాళ్లని నిరంతరం మానిటర్ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో డౌట్ వచ్చిన వారి లక్షణాలు ఉన్న శాంపిల్స్ ని ల్యాబ్ లకు పంపారు. దీంతో 135 మందికి పంపిస్తే 108 మంది నెగిటివ్ రాగా...మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో వెంటనే వారికి వైద్య సేవలు కూడా అందిస్తున్నారు.

 

ఇంకా 24 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. అయితే ఈ అనుమానిత కేసులన్నీ విదేశాల నుండి వచ్చిన వాళ్లేవి లేదా వారితో కలిసి ఉన్న కుటుంబ సభ్యులు వి. దీంతో విదేశాల నుండి వచ్చే వారందరికీ ఖచ్చితంగా 14 రోజులపాటు స్వీయా నిర్బంధం పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే చాలా మంది విదేశీయులు రాష్ట్రానికి తిరిగి వచ్చారు. హైదరాబాద్ మరియు చెన్నై ఎయిర్ పోర్ట్ నుండి ట్రైన్ మరియు బస్సు మార్గాల ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు. ఈ విధంగా 12 వేల మందికి పైగా రాష్ట్రానికి చెందిన వాళ్లు రాష్ట్రానికి రావడం జరిగింది. అయితే వీళ్లందరినీ గుర్తించడం మామూలుగా అయితే ఎవరికీ సాధ్యం కాదు.

 

దీంతో ఏపీ మినహా మిగతా రాష్ట్రాలు గుర్తించలేకపోతున్నాయి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఎక్కడా లేనివిధంగా గ్రామ సచివాలయ మరియు వాలంటీర్ల వ్యవస్థ ఉన్నాయి. వీరికి ఆశా వర్కర్లు కూడా తోడయ్యారు. దీంతో వీళ్ళందరూ విదేశాల నుండి రాష్ట్రానికి వచ్చిన వాళ్ళ వివరాలు తెలుసుకోవడానికి ఇంటింటి సర్వే చేపట్టారు. ఏపీ అధికారులు గ్రామ మరియు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా వివరాలు సేకరించారు. కోటి 40 లక్షల కుటుంబాలు ఉండగా వాటిలో కోటీ 30 లక్షల కుటుంబాల సర్వే జరిగింది. ప్రతి పట్టణం మరియు గ్రామాల్లో విదేశాల నుండి వచ్చిన వారి వివరాలు గుర్తించారు. విదేశాల నుండి వచ్చిన వారిని పూర్తిస్థాయిలో వైద్య పర్యవేక్షణలో ఉంచారు. ఇది నిజంగా ఏ రాష్ట్రానికి లేని సదుపాయం. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఇలా ఇంటింటికి తిరిగి కరోనా బాధితులను గుర్తించగలిగారు. దీంతో దేశంలో ఎక్కడా లేని సరికొత్త రికార్డు సృష్టించే విధంగా సీఎం జగన్ ఆలోచనలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: