కరోనా విపరీతమైన వేగంతో వ్యాపిస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ రెండో దశలో కరోనా ప్రవేశించింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రెండు రాష్ట్రాలు చిత్త శుద్ధితో పని చేస్తున్నాయి. ఇందుకు రెండు ప్రభుత్వాలను మెచ్చుకోవాలి. అయితే ఇదే సమయంలో కరోనా కట్టడి కోసం ఇతర ప్రాంతాలు ఫాలో అవుతున్న మంచి విషయాలను మనం కూడా ఇంప్లిమెంట్ చేయాలి.

 

 

ఉదాహరణకు కరోనా ప్రభావం ఇండియాలో మొదటగా బయటపడిన కేరళలో పరిస్థితి మనకంటే దారుణంగా ఉంది. కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. దాదాపు 80 వరకూ ఆ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందుకే ఆ ప్రభుత్వం కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఓ సూపర్ ఐడియా అమలు చేస్తోంది. అదేంటో తెలుసా.. ప్రతి నగరంలోనూ.. ప్రతి గ్రామంలోనూ ఉరిలో అడుగు పెట్టే చోటా.. ఊరి నుంచి బయటకు వెళ్లే చోటా.. విరివిగా చేతులు కడుకున్నే అవకాశాలు ఏర్పాటు చేస్తున్నారు.

 

 

కరోనా ప్రధానంగా వ్యాపించేది చేతుల ద్వారానే.. కరోనా వ్యక్తిని మనం తాకిన తర్వాత.. అదే చేత్తో ఎవరిని తాకినా వారికీ కరోనా వ్యాపిస్తుంది. అందుకే మనం వీలైనంత ఎక్కువగా చేతులు కడుక్కోవాలని చెబుతున్నారు. కరక్టే కానీ.. ఆ అవకాశం ఉండాలిగా. అందుకే కేరళలో విరివిగా ఈ చేతులు కడుక్కునేందుకు మొబైల్ వాష్ బేషిన్లు ఏర్పాటు చేస్తున్నారు.

 

 

మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ పని చేయాలి.. కనీసం కిలోమీటరు, రెండు కిలోమీటర్లకు ఒకటైనా ఇలా చేతులు కడుక్కునే వెసులు బాటు కల్పిస్తే ముందు కరోనా వ్యాప్తిని కట్టడి చేయొచ్చు.. ఆ తరవాత జబ్బు వచ్చిన వాడికి నయం చేయొచ్చు. లేకపోతే.. తెలుగు రాష్ట్రాలు కూడా ఇటలీ, స్పెయిన్ లా మారే ప్రమాదం ఉంది. పాలకులూ కాస్త ఆలోచించండయ్యా...?

 

మరింత సమాచారం తెలుసుకోండి: