మూలిగే నక్క మీద తాటికాయ పడటం అంటే ఇదే కాబోలు. ఇప్పటికే కరోనా ధాటికి ప్రపంచం మొత్తం అల్లాడి పోతోంది. వేలాది మంది ఈ వైరస్ బారిన పడి చనిపోగా లక్షలాది మందికి కరోనా పాజిటివ్ రావడంతో భవిష్యత్తులో ఇది ఎలాంటి విపరీత పరిణామాలకి దారితీస్తుందోనని  ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ప్రపంచ దేశాలు. కరోనాని పూర్తిగా నిర్మూలిచామని చెప్తున్న చైనా ప్రపంచానికి ఈ వైరస్ ని అంటించేసి వేడుక చూస్తున్న తరుణంలో..

IHG

కొత్తగా చైనాలోకి  మరో వైరస్ ఎంట్రీ ఇచ్చింది. ఈ వార్త ఇప్పుడు ప్రపంచ దేశాలని భయభ్రాంతులకి గురిచేస్తోంది. చైనాలోని యువన్ ఫ్రావిన్స్ లో ఓ వ్యక్తి బస్సులో కుప్ప కూలి అక్కడికక్కడే మరణించాడు. ఈ విషయాన్ని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ప్రకటించింది ఈ ఘటనతో ఒక్క సరిగా చైనా ప్రజలు ఉలిక్కి పడ్డారు. దాంతో చనిపోయిన వ్యక్తి ప్రయాణించిన బస్సులో ఉన్న సుమారు 32 మందిని పరీక్షలు చేసినట్టుగా వైద్యాధికారులు వెల్లడించారు. ఇదిలాఉంటే

IHG

ఈ హంటా వైరస్ కొత్తగా వచ్చింది కాదని గతంలోనే ఉన్న వైరస్ అని అయితే ఈ వైరస్ వ్యాప్తికి ఎలుకలే ప్రధాన కారణమని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రేవెంషణ్ ప్రకటించింది. ఈ వైరస్ ఇంటి పరిసర ప్రాంతాలలో ఎలుకలు, పంది కొక్కుల వరాల వ్యాప్తి చెందుతుందని తెలిపారు. ఎలుకల లాలాజలం , మూత్రం లేదా దాని వ్యర్ధాలు తాకిన వారు ఆ చేతులని తమ కళ్ళు, ముక్కు నోటిని తాకితే ఈ వైరస్ సోకుతుందని తెలిపారు. ఈ వైరస్ సోకిన వారికి వాంతులు, మైకం, విరోచనాలు, గుండె సంభందిత వ్యాధులు వస్తాయని, కండరాల నెప్పులు కూడా వస్తాయని దీని తీవ్ర్రత ఎక్కువైతే ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ నిండిపోయి శ్వాస తీసుకోలేని స్థితికి చేరుకొని చివరికి మరణిస్తారని తెలిపారు. కాగా ఈ వైరస్ ఒకరి నుంచీ ఒకరికి వ్యాపించడం చాలా తక్కువగ ఉంటుందని, హంటా వైరస్ గురించి ప్రజలు ఆందోళన  చెందాల్సిన అవసరం లేదని ప్రకటించారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: