పోషకాహార లోపం చిన్నపిల్లల పెరుగుదలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. తినే ఆహారంలో పోషక పదార్థాలు ఎక్కువగా లేకపోతే పిల్లలు ఎత్తు పెరగకుండా పొట్టి గానే మిగిలిపోతారు. అలాగే బరువు కూడా ఎక్కువగా పెరగలేరు. దీనివలన వారి యుక్త వయసులో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇటువంటి సమస్యలను మీ పిల్లలు ఎదుర్కోకుండా ఉండాలంటే వారికి ఎదుగుదల దశలో పోషకాహారాన్ని అందించాలి. ముఖ్యంగా పోషకాహారం అంటే ఏంటో తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఎంతైనా ఉంది. హార్లిక్స్, బూస్ట్ లాంటివి పాలలో కలపకుండా స్వచ్ఛమైన తేనెను కలిపి ఇవ్వడం ఎంతో ఆరోగ్యకరం. టీవీలో చూపిస్తున్న ప్రకటనలు చూసి అసలు మోసపోకండి. అరటి పండ్లు, యాపిల్స్, ద్రాక్ష పండ్లు, దానిమ్మ, బత్తాయి లాంటి పండ్లను ఎక్కువగా తినిపించండి. అలాగే బాదంపప్పు, జీడిపప్పు, వాల్ నట్స్, కిస్ మిస్ లాంటివి తరచుగా తినిపించండి.




ఒకవేళ మీ పిల్లలు ఎక్కువ ఎత్తు పెరగాలని మీరు ఆశిస్తుంటే... వారికి అత్యంత పోషకాహారమైన గుడ్లను తినిపించండి. ఇప్పటివరకి ఎన్నో పరీక్షలు చేసిన పోషణ శాస్త్రజ్ఞులు చెప్పింది ఏంటంటే... గుడ్డులో మనిషికి అవసరమైన అన్ని పోషక పదార్థాలు ఉంటాయని!! అందుకే మీ పిల్లలకు వారి ఎదిగే సమయంలో మెత్తగా ఉడికించిన గుడ్లను ప్రతి రోజూ తినిపించండి. అలా చేస్తే వారు ఎత్తు అత్యధిక వేగంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే గుడ్ల లో ఉన్న కొన్ని పోషక పదార్థాల వలన వారి బ్రెయిన్ లోని న్యూరాన్ల కనెక్టివిటీ దృఢపడుతుంది.




జ్ఞాపకశక్తి కూడా గుడ్లు తినడం ద్వారా పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే గుడ్లను ఎక్కువగా తినడం వలన తక్కువ బరువు సమస్యలు లాంటివి ఏమీ తలెత్తవు. ప్రస్తుతం కోడి గుడ్ల ధర భారతదేశంలో చాలా చౌకగా ఉండటం వలన... ఎటువంటి ఆర్థిక భారం ఎదుర్కోకుండా మీరు మీ పిల్లలకు ప్రతిరోజు గుడ్లను తినిపించవచ్చు. పోషక ఆహార పదార్థాలను ఎదుగుదల దశలో తినని ఏ పిల్లవాడైన తన తర్వాత జీవితంలో బలహీనంగా మారి ఏ పని సమర్థవంతంగా చేయలేకపోతాడు. అందుకే తల్లిదండ్రులు ఈ విషయాలన్ని గుర్తు పెట్టుకొని తమ పిల్లలకి మంచి పోషకాహారాన్ని అందించేందుకు ప్రయత్నించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: