టెక్నాలజీ మారింది అందుకే అన్నీ మారాయి ..దాంతో పాటుగా  కల్చర్ మారింది.. ఒకప్పుడు ఉద్యోగం చేసే మహిళలు కాళీ సమయం దొికినప్పుడల్లా ఈ గుడిలోనో లేదా కుటుంబ సబ్యులతోనో గడిపే వారు.. కానీ ఇప్పుడు వీకెండ్ వస్తె చాలు.. పబ్లు క్లబ్బులు అంటూ తెగ తిరగేస్తున్నా రు.. ఎంజాయ్ చేస్తున్నారు.. అయితే ఎంజాయ్ చేద్దామని చాలా మంది అనుకుంటారు.. ఆ క్రమంలో రచ్చ చేస్తుంటారు ..అయితే ఇక్కడ ఎంజాయింగ్ కన్నా కూడా విచిత్ర చేష్టలు ఎక్కువగా ఉన్నాయి.. 

 

 

 

 

 

హైదరాబాద్ నగరంలోని కొన్ని పబ్బుల్లో లైంగిక వేధింపులు, దాడులు తరచూ వెలుచూస్తున్నాయి. మాదక ద్రవ్యాల వినియోగం సరేసరి. కొందరు యువకులు ఉద్దేశ పూర్వకంగానే అక్కడికి వస్తున్న యువతులపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. మాదాపూర్‌లోని ఓ పబ్‌లో పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే కుమారుడు అభిషేక్‌ గౌడ్‌ ఓ యువ కథానాయికను ఇటీవల లైంగికంగా వేధించే యత్నం చేశాడు. ఈ సంఘటన మర్చిపోకముందే.. పంజాగుట్టలోని ఓ పబ్‌పై పోలీసులు కేసు నమోదుచేశారు. పబ్బుల్లో అక్రమాలపై తనిఖీలు చేయకపోవడంతో ఇలాంటివి జరుగుతున్నాయి..

 

 

 

 

ఈవిషయం పై ఆరా తీస్తే నెల నెలా పబ్ ల దగ్గరకు వెళ్లి జోబులు నింపు కుంటున్నారు అంటూ పోలీసుల గుట్టును బయటపెట్టారు.. అందుకే ఎం జరిగిన పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు..జూబ్లీహిల్స్‌లో ఒకటి 24గంటలూ తెరిచే ఉంటుంది. ఇక్కడికి కొందరు ఖరీదైన వినియోగదారులు అర్ధరాత్రి వేళల్లో  మాత్రమే వస్తారు.మాదాపూర్‌, గచ్చిబౌలి, బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 12 లోని పబ్బులు అర్ధరాత్రి దాటినా మద్యం విక్రయాలను కొనసాగిస్తున్నాయి.జారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌లోని మూడు పబ్బులు అర్ధరాత్రి దాటాక రణగొణ ధ్వనులు కొనసాగిస్తుంటే స్థానికులు గతంలో పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. 

 

 

 

 

ఇప్పుడు మరీ దారుణంగా మారింది.. ఒకప్పుడు మద్యం ఏరులై పారుతుంది.. కానీ ఇప్పుడు బ్రౌన్ సుగర్ హైటెక్ వ్యభిచారం అన్ని విచ్చల విడిగా జరుగుతున్నాయి..ఇప్పుడు తప్పనిసరిగా కొన్ని నిబంధనలను అధికారులు అమల్లోకి తీసుకొచ్చారని అంటున్నారు.. ఈ మేరకు బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం పోలీసు, ఎక్సైజ్‌ ఠాణాల పరిధుల్లోనే అధికంగా పబ్బులు ఉన్నాయి. ఎక్సైజ్‌శాఖ నిబంధనల ప్రకారం వీటిని అర్ధరాత్రి 12గంటలలోపు మూసివేయాలి. మైనర్లకు మద్యం సరఫరా చేయకూడదు.. అన్ని ప్రాంతాల్లో సిసి కేమారాలుండలి అని ఖరారు చేశారు..ఎంత చేసిన కూడా యువత దోరణి మారలేదని తెలుస్తుంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: