కొంతమంది దరిద్రులు ఎలా ప్రవర్తిస్తారంటే.. అరేయ్ కరోనా వచ్చిందిరా అంటే.. అందంగా ఉంటుందా.. నాక్కూడా ఒక్క చాన్స్ ఇస్తుందా అని ఆశగా అడుగుతారు.. ఆడపిచ్చి ఉన్న ఇలాంటి వెధవలకి కరోనా అంటే రోగమని కూడా అర్ధం చేసుకోరు.. అమ్మాయనుకుని ఇలా భ్రమపడతారు.. ఇకపోతే కొందరు ఖతర్నాక్ నాయాళ్లూ కరోనా అడ్దం పెట్టుకుని అమ్మాయిల మీద రెచ్చిపోతున్నట్లుగా తెలుస్తుంది.. సిగ్గుశరం లేని ఇలాంటి మనుషులకు నిజంగా కరోనా వచ్చి తొందరగా తీసుకుపోతే బాగుండును అని అంటున్నారు..

 

 

ప్రపంచం అంతా భయం భయంగా బ్రతుకుతుంటే కొందరు పోకిరీలు మాత్రం కరోనా వైరస్ పేరుతో ర్యాగింగ్ చేస్తూ వెధవ్వేషాలు వేస్తున్నారట.. ఈ ఘటన సాక్షాత్తు దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.. ఒంటరిగా కనిపించిన అమ్మాయిలను ఏడ్పించి తప్పించుకోవడానికి కరోనా పేరు చెబుతున్నారట దొంగ నాయాళ్లూ.. ఈ వివరాలు తెలుసుకుంటే..

 

 

ఢిల్లీలో నివసిస్తున్న మణిపురికి చెందిన ఓ యువతి (25) ఇంట్లోకి నిత్యవసర సరకులు తెచ్చుకునేందుకు న్యూ ఢిల్లీలోని ముఖర్జీ నగర్ మార్కెట్‌కి వెళ్లి తిరిగి వస్తుండగా, ఎదురుగా వచ్చిన ఓ యువకుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడట. దీంతో ఆ యువతి అతనికి ఎదురు తిరగ్గా, కరోనా అంటూ ఆ యువకుడు గట్టిగా అరిచాడు. అతను ఏం చేస్తున్నాడో అర్ధంకాక అయోమయంలో ఉన్న ఆ యువతి పై అసహ్యంగా ఉమ్మేసి నీచంగా ప్రవర్తిస్తూ, ఆమెకి కరోనా ఉందంటూ పెద్దగా కేకలు వేస్తూ అక్కడి నుంచి పరారయ్యాడు.

 

 

దీంతో షాక్ తిన్న ఆ యువతి నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయగా పోలీసులు వేధింపుల కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఈ ఘటన గురించి తెలుసుకున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందిస్తూ, కరోనా విజృంభిస్తున్న ఇలాంటి సమయంలో దేశం ఐక్యంగా ఉండాలని కానీ ఇలాంటి పిచ్చిపిచ్చి వేషాలు వేయడం సరైంది కాదని పేర్కొంటు ఆ యువకున్ని త్వరగా అరెస్ట్ చేయాలన్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: