మ‌య‌న్మార్‌.. చైనాతో స‌రిహ‌ద్దు క‌లిగిన దేశం. అయినా.. చైనాలోని వుహాన్ న‌గ‌రం కేంద్రంగా పుట్టిన‌ క‌రోనా మ‌హ‌మ్మారి ఈ దేశంపై ప్ర‌భావం చూప‌లేదు. ఇప్ప‌టికే ప్ర‌పంచ దేశాలు ఈ వైర‌స్‌తో అత‌లాకుత‌లం అవుతున్నాయి. చైనాలో ఇప్ప‌టికే సుమారు మూడువేల మందికిపైగా మ‌ర‌ణించారు. ఇక ఇట‌లీలో అయితే మ‌ర‌ణ మృదంగం కొన‌సాగుతోంది. సుమారు ఆరువేల మందికిపైగా ప్ర‌జ‌లు మృతి చెందారు. ఆ త‌ర్వాత ఇరాన్‌లో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం తీవ్రంగా ఉంది. అమెరికా కూడా అత‌లాకుత‌లం అవుతోంది. ఇప్ప‌టికే సుమారు 50దేశాలు లాక్‌డౌన్ ప్ర‌క‌టించాయి. జ‌న‌జీవ‌నం మొత్తం స్తంభించిపోయింది. ప్ర‌జ‌లు ఇళ్ల‌కే ప‌రిమితం అవుతున్నారు. ఇంత వేగంగా ప్ర‌పంచ దేశాల‌కు ఈ వైర‌స్ వ్యాపించినా స‌రిహ‌ద్దు క‌లిగిన మ‌య‌న్మార్‌లో మాత్రం పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేదు. తాజాగా.. ఈ దేశంలో ఒకే ఒక్క క‌రోనా పాజిటివ్ కేసు న‌మోదు అయింది. 

 

 ఈ విష‌యాన్ని మ‌య‌న్మార్ దేశం అధికారికంగా ప్ర‌క‌టించింది. అమెరికా నుంచి వ‌చ్చిన 36 ఏండ్ల యువ‌కుడికి క‌రోనా పాజిటివ్ వచ్చిన‌ట్లు పేర్కొంది. అటు బ్రిట‌న్ నుంచి వ‌చ్చిన మ‌రో ఇద్ద‌రికి కూడా క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్నాయి. వారితో స‌న్నిహితంగా ఉన్న‌ ప‌లువురిని ప‌రీక్షంచ‌నున్న‌ట్లు ఆ దేశ‌ అధికారులు తెలిపారు. అయితే.. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధానికి మ‌య‌న్మార్ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టికే వైర‌స్ ప్ర‌భావం తీవ్రంగా ఉన్న దేశాలు లాక్‌డౌన్ ప్ర‌క‌టించాయి. ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ అత‌లాకుత‌లం అవుతోంది. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్‌తో సుమారు 16500మందికిపైగా మృతి చెందారు. ల‌క్ష‌లాది మంది వైర‌స్ బారిన ప‌డ్డారు. ఇక భార‌త్‌లోనూ క‌రోనా వైర‌స్ తీవ్ర ప్ర‌భావంచూపుతోంది. క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్ర‌మం త‌ప్ప‌కుండా పెరుగుతూ ఉంది. తాజాగా మ‌హారాష్ట్ర‌లో మ‌రో వ్య‌క్తి క‌రోనా కాటుకు బ‌లికావ‌డంతో దేశంలో మొత్తం మ‌ర‌ణాలు సంఖ్య 10కి చేరింది. పాజిటివ్ కేసుల సంఖ్య సైతం 492కు చేర‌కుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: