మార్చి 27వ తేదీన ఒకసారి చరిత్ర లోకి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖులు జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి. 

 

 విల్మ్ హెల్మ్ కాన్రాడ్ రాంట్ జెన్ జననం : జర్మన్ భౌతిక శాస్త్రవేత్త ప్రపంచంలో వైద్యరంగం రోగ నిర్ధారణకు రేడియోగ్రఫీ రోగ  నిర్మూలనకు రేడియోథెరపీ కొరకు ఉపయోగించే ఎక్స్ కిరణాలను కనుగొన్న శాస్త్రవేత్త అయిన ఈయన  1845 మార్చి 27వ తేదీన జన్మించారు. ఈయన  కనుగొన్న ఎక్స్ కిరణాలు కేవలం వైద్య రంగం లోనే కాకుండా భద్రతా రంగంలో కూడా ఎంతగానో ఉపయోగపడుతున్నాయి . 1895 నవంబర్ 18వ తేదీన విద్యుదయస్కాంత తరంగాల లో ఉన్న తరంగధైర్ఘ్యము అవధులు లో గల ఎక్స్ కిరణాలు కనుగొన్నాడు ఈయన.  ఈ పరిశోధన వల్ల 1991లో భౌతికశాస్త్రంలో మొదటిసారి నోబెల్ బహుమతిని అందుకున్నారు. ఈయన భౌతిక శాస్త్రంలో చేసిన కృషికిగాను ఆవర్తన పట్టికలో 111 పరమాణువుల సంఖ్య గల మూలకానికి అనే గాంట్  యూనియన్ అనే పేరు పెట్టి గౌరవించారు. 

 

హెచ్ వి బాబు జననం : 1930వ దశకంలో ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు సరస్వతి టాకీస్  అనే చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి తెలుగు సినిమాలను నిర్మించిన నిర్మాత ఈయన 1903 మార్చి 27వ తేదీన బెంగళూర్లో జన్మించారు. వైద్య విద్యను అభ్యసించిన ఈయన తొలి తమిళ సినిమా కాళిదాసు లో నటించారు. హెచ్.వి.బాబు బొంబాయిలో సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో కూడా హైదరాబాద్ లో ఆధ్యాపకునిగా ఉన్న ఈయన సినిమాల్లోకి వచ్చారు .  బొంబాయికి చెందిన కోహినూర్ ఫిలిం కంపెనీ ద్వారా నటుడిగా చిత్రరంగంలో ప్రవేశించారు. 

 

 

 రామ్ చరణ్ జననం : ప్రముఖ తెలుగు సినిమా నటుడు మెగాస్టార్ చిరంజీవి కుమారుడు అయినా రామ్ చరణ్ 1985 మార్చి 27వ తేదీన జన్మించారు. అయితే రామ్ చరణ్ కేవలం నటుడిగానే కాకుండా హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ యొక్క ఓనర్ గా కూడా  ఉన్నారు. మాటీవీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ లలో  రాంచరణ్ కూడా ఒకరు. 2007 సంవత్సరంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుత సినిమా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యాడు రామ్ చరణ్. మొదటి సినిమాతోనే ఉత్తమ నూతన నటుడు గా కూడా ఫిలింఫేర్ అవార్డ్ ని  దక్కించుకున్నాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మగధీర సినిమాలో కూడా ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును దక్కించుకున్నారు. ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి అంచలంచలుగా ఎదిగి ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు మెగాపవర్ స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో నటిస్తున్నారు. 

 

 

 మనుభాయ్ పటేల్ మరణం : ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధుడు గాంధేయవాది గుజరాత్ మాజీ మంత్రులైన మనో భాయ్ పటేల్ 2015 మార్చి 27వ తేదీన మరణించారు. 

 

 సయ్యద్ అహ్మద్ ఖాన్ మరణం : భారత విద్యావేత్త రాజకీయ వేత్త అయిన సయ్యద్ అహ్మద్ ఖాన్ 1898 మార్చి 27వ తేదీన మరణించారు. 

 

 యూరీ గగారిన్ మరణం : అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి మానవుడుగా  ఒక రికార్డు సృష్టించిన యూరి  గాగారిన్  1968 మార్చి 27వ తేదీన మరణించారు. ఇతడిని రష్యన్ ప్రభుత్వం సోవియట్ హీరోగా పిలుస్తూ  ఉంటుంది. భూమి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించిన వాడిగా ఈయన చరిత్ర లోకెక్కాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: