దేశంలో సాధారణంగా రేషన్ షాపువద్ద, సినిమా టికెట్స్ వద్ద మరికొన్ని చోట్ల క్యూ పద్దతి పాటిస్తుంటారు.. అప్పడప్పుడు ఆ లైన్ల వద్ద హద్దులు దాటం ఒకరినొకరు తోసుకోవడం గొడవ గొడవ ఉండటం చూస్తూనే ఉంటాం. అలాంటింది దేశంలో ఏ ముహూర్తంలో ‘కరోనా వైరస్’ ప్రభావం చూపించడం మొదలు పెట్టిందో కానీ మనిషికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. కరోన వైరస్ సోకకుండా ఉండాలని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నా జనాలు రోడ్లపైకి వస్తున్నారని పోలీసులు నెత్తీ నోరు బాదుకుంటున్నారు. ఇక కరోనా వైరస్ చాలా ప్రమాదం అని.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనాలకు చెబుతనే ఉన్నారు.  కానీ కొన్ని చోట్ల ఇవేవీ పట్టనట్టు జనాలు ప్రవర్తిస్తున్నారు. 

 

దాంతో ఇప్పుడు పోలీసులు ఎంట్రీ ఇవ్వడం చితకబాది మరి క్రమశిక్షణ పాటించేలా చేయడం జరుగుతుంది.  ఇక హద్దులు దాటిన వారికి జైలు శిక్ష విధిస్తామని చెప్పినా.. జనాల పంథా మాత్రం మార్చుకోవడం లేదు. ఇలాంటి మొండి జనాలు ఒక్కసారి ఆందోల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లోని ప్రజల ముందజాగ్రత్తగా తీసుకుంటున్న చర్యలను చూసి నేర్చుకోవాల్సిందే. ‘ఎవరో వచ్చి తమకు చెప్పడం ఎందుకూ.. కరోనా ఎంత దుర్మార్గురాలో మాకు తెలుసు. మేమే మేలుకుంటాం, మా గ్రామాన్ని ఆ మహమ్మారి బారినుంచి కాపాడుకుంటాం..’ అన్నట్టు గ్రామస్థులు అందరూ ఒక్క తాటిమీద ఉన్నారు.   

 

ఈ నేపథ్యంలో ఊరి పొలిమేర్లో కొంత మంది కాపలా ఉంటూ.. ఊర్లోకి ఎవ్వరినీ రానివ్వకుండా.. ఊర్లో వారు బయటకు పోనివ్వకుండా రూల్స్ పెట్టుకున్నారు. అంతే కాదు..  నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం దుకాణాల వద్దకు వస్తున్నవారి కోసం క్రమపద్ధతిలో ఒకరికొకరికి మధ్య దూరాన్ని కొనసాగిస్తున్నారు. కాగా, హైదరాబాద్‌లోని పలు దుకాణాల ముందు జనాలు మనిషికి మనిషికి మధ్య మీటరు దూరం ఉండేలా సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు.  ముగ్గు వేసి డబ్బాల్లో నిలబడుతూ సామాజిక దూరం పాటిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: