నిజంగా ఏబిఎన్, ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణకు పెద్ద అవమానమే జరిగింది. తనకు జరిగిన అవమానాన్ని వేమూరి ఎలా తట్టుకుంటున్నాడో ఏమో ఆయనకే తెలియాలి. ఇంతకీ విషయం ఏమిటంటే కరోనా వైరస్ నియంత్రణపై ప్రధానమంత్రి నరేంద్రమోడి దేశంలోని మీడియా సంస్ధల యాజమాన్యాలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న చాలామంది తమకు తోచిన సూచనలు, సలహాలు ఇచ్చారు. అదే సందర్భంలో మోడి కూడా మీడియా పాత్రను ప్రశంసిస్తునే, బాధ్యతలను కూడా గుర్తు చేశారు.

 

సరే ఇంత వరకూ బాగానే ఉంది. అయితే అసలు ట్విస్టంతా ఇక్కడే జరిగింది. టెలికాన్ఫరెన్సు అయిపోయిన తర్వాత ఇటు ఈనాడు అటు ఆంధ్రజ్యోతిలో ఎవరికి వాళ్ళుగా వార్తలు ప్రముఖంగా రాసుకున్నారు. ఆంధ్రజ్యోతిలో వీడియో కాన్ఫరెన్సుపై తనతో పాటు ఈనాడు గ్రూపుసంస్ధల ఛైర్మన్ రామోజీరావుతో పాటు చాలామంది పాల్గొన్నట్లు వచ్చింది.

 

అదే సమయంలో ఈనాడులో మాత్రం ప్రధానితో జరిగిన వీడియో కాన్ఫరెన్సులో  ఈనాడు గ్రూపుసంస్ధల ఛైర్మన్ రామోజీరావు పాల్గొన్నట్లు మాత్రమే వచ్చింది. పొరబాటున వేమూరి రాధాకృష్ణ కూడా పాల్గొన్నట్లు ఒక్క ముక్క కూడా లేదు. ఇక్కడే రామోజీ దృష్టిలో రాధాకృష్ణ స్ధాయి ఏంటో అర్ధమైపోతోంది.  నిజానికి రామోజీ స్ధాయి వేమూరికి లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఏదో అదృష్టం కలిసొచ్చి తర్వాత చంద్రబాబునాయుడు అండతో ఆంధ్రజ్యోతి మీడియాను ఆర్కె సొంతం చేసుకున్నాడన్న విషయం అందరికీ తెలుసు.

 

కాకపోతే మారిన పరిస్ధితుల్లో చంద్రబాబు దగ్గర రామోజీ స్ధానాన్ని తాను సొంతం చేసుకోవాలని రాధాకృష్ణ తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అందుకనే జగన్మోహన్ రెడ్డి అంటే అన్నీ మరచిపోయి బుర్రలోకి ఏది తోస్తే అది రాసేస్తున్నాడు. తాను రాసేది తప్పుడు రాతలే అని తెలిసినా కేవలం చంద్రబాబు మెప్పుకోసం రాధాకృష్ణ పాకులాడుతున్నట్లు అర్ధమైపోతోంది. చంద్రబాబు దగ్గరకు రాధాకృష్ణ వెళుతుంటే రామోజీ దగ్గరకు చంద్రబాబే వెళుతాడని టిడిపిలోనే చెప్పుకుంటారు. ఇక్కడే రాధాకృష్ణ స్ధాయేంటో తెలిసిపోలా ?

మరింత సమాచారం తెలుసుకోండి: